M.R.P vs MRP: అక్షరాల మధ్యలో ‘చుక్కలు’ లేవని భారీ ఫైన్.. మండిపడుతున్న మద్యం వ్యాపారులు..

M.R.P vs MRP: ఒక్క ఫుల్‌స్టాప్ మద్యం తయారీదారులకు వణుకు పుట్టిస్తోంది. దాంతో తమకు ఇబ్బందిగా పరిణమించిన సమస్యకు చెక్ పెట్టేందుకు పోరుబాట పట్టారు మద్యం వ్యాపారులు. మద్యం బాటిళ్లపై గరిష్ట చిల్లర ధరకు ఇంగ్లీష్‌లో ఎంఆర్‌పి అని సంక్షిప్తంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే, ఈ ఎంఆర్‌పీ మధ్య పెట్టే చుక్కలే ఇప్పుడు వ్యాపారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి.

M.R.P vs MRP: అక్షరాల మధ్యలో 'చుక్కలు' లేవని భారీ ఫైన్.. మండిపడుతున్న మద్యం వ్యాపారులు..
M.R.P vs MRP
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 28, 2023 | 2:14 PM

M.R.P vs MRP: ఒక్క ఫుల్‌స్టాప్ మద్యం తయారీదారులకు వణుకు పుట్టిస్తోంది. దాంతో తమకు ఇబ్బందిగా పరిణమించిన సమస్యకు చెక్ పెట్టేందుకు పోరుబాట పట్టారు మద్యం వ్యాపారులు. మద్యం బాటిళ్లపై గరిష్ట చిల్లర ధరకు ఇంగ్లీష్‌లో ఎంఆర్‌పి అని సంక్షిప్తంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే, ఈ ఎంఆర్‌పీ మధ్య పెట్టే చుక్కలే ఇప్పుడు వ్యాపారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. తూనికలు, కొలతల విభాగం ప్రకారం ప్రతి వస్తువుపై MRP అని రాసి ఉండాలి. అలా రాసి లేని పక్షంలో వ్యాపారులకు భారీ జరిమానా విధిస్తోంది లీగల్ మెట్రాలజీ విభాగం. డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఇది చట్టవిరుద్ధం అని, మద్యం తయారీదారులు దీనిని గమనించాలని పేర్కొంటున్నారు అధికారులు. అయితే, ఈ చుక్కలను అడ్డు పెట్టుకుని తమను వేధించడం సరికాదని మద్యం వ్యాపారులు వాదిస్తున్నారు.

‘1985 ప్రమాణాల బరువులు, కొలతల (ఎన్‌ఫోర్స్‌మెంట్) చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. గరిష్ఠ చిల్లర ధరను MRP గా పేర్కొనాలి. మునుపటిలా M.R.P అని పేర్కొనవద్దు. కొన్ని చిన్న చిన్న సూపర్ మార్కెట్లు ఇప్పటికీ తమ ప్యాకేజింగ్‌లో M.R.Pని ఉపయోగిస్తున్నాయి. ఇదే కారణంతో ఇటీవలి కాలంలో మద్యం కంపెనీలతో పాటు.. ఇతరుల ప్రోడక్ట్స్ కంపెనీలపైనా ప్రభుత్వం జరిమానా విధించింది.’ అని చెప్పుకొచ్చారు అధికారులు.

అయితే, ఇటీవలి నిబంధనల మార్పు గురించి తమకు తెలియదని, దీని గురించి ఎలాంటి సమాచారం మాకు ప్రభుత్వం తెలియజేయలని మద్యం కంపెనీలు సహా ఆయా కంపెనీలు వాదిస్తున్నాయి. ‘ఈ మధ్య కాలంలో రోజుల వ్యవధిలోనే ఈ సమస్యను సాకుగా చూపుతూ రెండుసార్లు జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. వారు సైత గరిష్ట చిల్లర ధర లేబుల్‌ని చూపుతూ ఫైన్ వేసినట్లు వివరించారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ, తూనికలు, కొలతల శాఖలకు ఫిర్యాదు చేశాం.’ అని నగరానికి చెందిన ఓ మద్యం కంపెనీకి చెందిన వ్యక్తి చెప్పారు.

ఎలాంటి సర్క్యూలర్ కాపీ ఇవ్వలేదు..

కాగా, అధికారులు తమకు ఎలాంటి సర్క్యూలర్ కాపీని ఇవ్వలేదని తయారీదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 5 వేల నుంచి రూ. 1 లక్షల వరకు జరిమానాలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మద్యం తయారీదారులు చెబుతున్నారు. మద్యం కపెనీల లాభాల మార్జిన్లు స్వల్పంగా ఉంటాయని, ఇలాంటి నిర్ణయాలతో వ్యాపారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలి. ఈ సమస్యతో ఇప్పుడు తాము ఇబ్బందికి గురవుతున్నామని మద్యం వ్యాపారులు వాపోతున్నారు.

అన్ని ప్రోడక్ట్స్‌పైనా ఎంఆర్‌పి మధ్యలో చుక్క ఉండొద్దు..

అయితే, మద్యం వ్యాపారులపైనే కాకుండా.. ప్రతి ప్రోడక్ట్‌పైన ఉండే ఎంఆర్‌పి లేబుల్‌లో చుక్క ఉండొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సర్క్యూలర్‌లో స్పష్టం చేసింది ప్రభుత్వం. వ్యాపారులూ ఇకనైనా దీనిని గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచన.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..