AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మమ్మల్ని ఎవరు చూస్తారులే అని పిచ్చి వేషాలు వేస్తున్నారా.? షీ టీమ్స్‌ ఉంది, తోలు తీస్తారు..

గణేష్ నిమర్జనం సందర్భంగా ట్యాంక్బండ్ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా అందరూ ట్యాంక్‌బండ్‌ పరిసరాలకు రావడంతో ఇసుకేస్తే రాలనంత జనం. దీంతో పోకీరులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను తాకరాని చోట తాకకుండా ఇంబందులకు గురి చేస్తున్నారు. పోకిరీల ఆట కట్టించేందుకే షీ టీమ్స్ బృందాలు మఫ్టీలో భక్తుల్లా తిరుగుతూ...

మమ్మల్ని ఎవరు చూస్తారులే అని పిచ్చి వేషాలు వేస్తున్నారా.? షీ టీమ్స్‌ ఉంది, తోలు తీస్తారు..
Representative Image
Sravan Kumar B
| Edited By: Narender Vaitla|

Updated on: Sep 28, 2023 | 2:57 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28: గణేష్ నవరాత్రి సందర్భంగా మండపాలన్ని భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతున్నాయి. అయితే బాలాపూర్, ఖైరతాబాద్ బడా గణేష్ లాంటి విగ్రహాలను చూసేందుకు లక్షల్లో భక్తులు వస్తుంటారు. విఘ్నేశ్వరుడు దర్శనానికి మహిళలు ఎక్కువగా వస్తున్నారు. దీంతో పోకిరీలు రెచ్చిపోతున్నారు. అసభ్యకరంగా, ఉద్దేశపూర్వకంగా తాకుతూ మహిళలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే పోకిరిల భరతం పట్టేందుకు షీ టీమ్స్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

గణేష్ నిమర్జనం సందర్భంగా ట్యాంక్బండ్ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా అందరూ ట్యాంక్‌బండ్‌ పరిసరాలకు రావడంతో ఇసుకేస్తే రాలనంత జనం. దీంతో పోకీరులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను తాకరాని చోట తాకకుండా ఇంబందులకు గురి చేస్తున్నారు. పోకిరీల ఆట కట్టించేందుకే షీ టీమ్స్ బృందాలు మఫ్టీలో భక్తుల్లా తిరుగుతూ పోకీరిల ఆట కట్టిస్తున్నారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి షీ టీమ్స్ అధికారులు ఒక వీడియోని విడుదల చేశారు.

షీ టీమ్స్ విడుదల చేసిన వీడియో.. 

అందులో గుంపుగా నిలబడ్డ అమ్మాయిలను ఒక పోకిరి వెనకనుంచి ఉద్దేశపూర్వకంగా తాకి నడుము పై చేయి వేశాడు వెంటనే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసేసరికి గుంపులోంచి ముందుకు వెళ్ళిపోయి తప్పించుకున్నాడు. మఫ్టీ లో ఉన్న షీ టీమ్స్ వద్ద ఉన్న కెమెరాలో మొత్తం దృశ్యాలు రికార్డు అయ్యాయి. వెంటనే అపోకిరిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు. మరోచోట దేవుని దర్శించుకునేందుకు భక్తులందరూ క్యూలైన్లో నిలబడగా ఓ మహిళ వెనకాల నిలుచున్న మరో ప్రబుద్ధుడు వెనకనుంచి ఉద్దేశపూర్వకంగా తాకటానికి తన కుడి కాలని ముందుకు జరిపి మహిళను వెనుక వైపు తాకే విధంగా నిలబడ్డాడు.

ఇదంతా అక్కడ ఉన్న షీ టీమ్స్ అధికారులు తమ బాడీ కెమెరాలో రికార్డు చేశారు.ఇంకేముంది సీన్ కట్ చేస్తే మనోడు కూడా పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు.ఈ రెండు సంఘటనని సంబంధించిన ఫోటోలని ఒక వీడియో ఎడిట్ చేసి హైదరాబాద్ షీటీమ్‌ పోలీసులు విడుదల చేశారు. ఎలాంటి ఇబ్బంది కలిగిన డయల్ 100కి కాల్ చేయాలని దాంతో పాటుగా తమ కంప్లైంట్ లను సోషల్ మీడియా ద్వారా ఎలా రిజిస్టర్ చేయాలో ఆ వీడియోలో వివరించారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, హాకా ఐ, యూట్యూబ్ ఇలా షీ టీం సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఆ వీడియోలో చూపించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..