AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జాగ్రత్త గురూ.. డాక్టర్ సలహా లేకుండా ఈ ఇంజెక్షలు వాడితే అంతే ఇక..

హైదరాబాద్‌లో యువత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ల అక్రమ విక్రయాలు సాగిస్తున్న అబ్దుల్ గఫార్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కండరాల వృద్ధి కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకుని, లైసెన్స్ లేకుండా ఈ షెడ్యూల్ హెచ్ డ్రగ్‌ను అధిక ధరకు విక్రయిస్తున్నాడు. దీని వాడకం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు వంటి తీవ్ర సమస్యలు వస్తాయని పోలీసులు హెచ్చరించారు.

Hyderabad: జాగ్రత్త గురూ.. డాక్టర్ సలహా లేకుండా ఈ ఇంజెక్షలు వాడితే అంతే ఇక..
Illegal Drug Sale Hyderabad
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jan 30, 2026 | 7:05 PM

Share

యువత ప్రాణాలకు హాని కలిగించే ‘మెఫెంటెర్మైన్ సల్ఫేట్’ (Mephentermine Sulphate) ఇంజక్షన్లను ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సౌత్ జోన్) ఫలక్ నుమా పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి సుమారు రూ. 24,000 విలువైన ఇంజక్షన్లు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతన్ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ గఫార్ ఖాన్, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. బర్కాస్ ప్రాంతానికి చెందిన అహ్మద్ నాది అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు ఈ ఇంజక్షన్లను కొనుగోలు చేసి, తన నివాసం సమీపంలోని జహనుమా, ఫలక్ నుమా పరిసరాల్లో యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ముఖ్యంగా కండరాలు త్వరగా పెరగాలని కోరుకునే యువతను ఇతను లక్ష్యంగా చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్, ఫలక్ నుమా పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకొని, అతని వద్ద నుండి సుమారు రూ. 24,000 విలువైన ఇంజక్షన్లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఫలక్ నుమా పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 47/2026, సెక్షన్స్ 318(4), 278, r/w 3(5) BNS కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అహ్మద్ నాది ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

మెఫెంటెర్మైన్ సల్ఫేట్ వాడితే ఏం జరుగుతుంది

మెఫెంటెర్మైన్ సల్ఫేట్ అనేది ‘షెడ్యూల్ హెచ్’ (Schedule H) డ్రగ్. దీనిని కేవలం గుర్తింపు పొందిన వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలి. డాక్టర్ సలహా లేకుండా వీటిని వాడటం వల్ల గుండెపోటు (Cardiac Arrest), అధిక రక్తపోటు (High BP) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పోలీసులు హెచ్చరించారు. కాబట్టి జనాలు ఎవ్వరూ డాక్టర్ డి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి ఇంజక్షన్లను వాడకూడదను కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.