AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్నాడు కదూ.. బ్యాగ్రౌండ్ తెలిస్తే మాత్రం దిమ్మతిరగాల్సిందే

నాగర్‌కర్నూల్‌ జిల్లా తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన 28 ఏళ్ళ రత్లావత్‌ శంకర్‌నాయక్‌ అలియాస్‌ రాజేశ్‌రెడ్డి . గద్వాల్‌ ఎర్రవల్లిలోని కళాశాలలో 2012లో బీ ఫార్మసీ పూర్తిచేశాడు. హత్యాయత్నం కేసులో గద్వాల్‌ పోలీసులు అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. అక్కడ చోరీ కేసులో అరెస్టయిన ఒక యువకుడు పరిచయమయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక గంజాయి, మద్యం వంటి దురలవాట్లకు అలవాటయ్యాడు...

చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్నాడు కదూ.. బ్యాగ్రౌండ్ తెలిస్తే మాత్రం దిమ్మతిరగాల్సిందే
Thief In Hyderabad
Ranjith Muppidi
| Edited By: Narender Vaitla|

Updated on: Dec 28, 2023 | 9:50 PM

Share

అతనో విచిత్రమైన దొంగ. తాను ఎక్కడ దొంగతనం చేసినా ఆ ఇంట్లో కొట్టేసిన నగదు, నగలు వివరాలను చీటీ రాసి అక్కడ ఉంచుతాడు. అదే వివరాలను తన డైరీలోనూ రాసుకుంటాడు. పోలీసులకు దొరికి సొత్తుకు ఎక్కువ చూపితే డైరీ చూపి మరీ వివరాలు చెబుతాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ చోరీలు చేసిన ఈ ఘరానా దొంగ ఓయూ పోలీసులు చిక్కాడు. ఇతని శైలి చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. చోరీ చేసిన సొత్తును తాకట్టు పెట్టి జల్సాలు చేయడం గమనార్హం.

నాగర్‌కర్నూల్‌ జిల్లా తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన 28 ఏళ్ళ రత్లావత్‌ శంకర్‌నాయక్‌ అలియాస్‌ రాజేశ్‌రెడ్డి . గద్వాల్‌ ఎర్రవల్లిలోని కళాశాలలో 2012లో బీ ఫార్మసీ పూర్తిచేశాడు. హత్యాయత్నం కేసులో గద్వాల్‌ పోలీసులు అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. అక్కడ చోరీ కేసులో అరెస్టయిన ఒక యువకుడు పరిచయమయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక గంజాయి, మద్యం వంటి దురలవాట్లకు అలవాటయ్యాడు. వాటికి అవసరమైన డబ్బు కోసం చోరీలు బాటపట్టాడు. కొట్టేసిన విలువైన వస్తువులు విక్రయించటం, తాకట్టు పెట్టడం ద్వారా వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని ప్రారంభించాడు.

మగమిత్రుల (స్వలింగ సంపర్కం) కోసం ఎంతకైనా తెగించేవాడు. వారిని సంతోషపెట్టేందుకు ఏదైనా చేసేందుకు సిద్ధమయ్యేవాడు. వారికి డబ్బు అవసరమైందని తెలిస్తే చాలు. అదే రోజు ఏదో ఒక ఇంట్లోకి చొరబడి క్షణాల్లో నగదు, నగలు చోరీ చేయటం ఇతడి ప్రత్యేకత. ఏపీ, తెలంగాణాల్లోని పలు పోలీస్‌స్టేషన్‌ల్లో ఇతడు మోస్ట్‌వాంటెండ్‌ గా ఉన్న శంకర్…ఎక్కడా ఒక చోట స్థిరంగా ఉండకుండా తప్పించుకు తిరుగుతాడు. పెద్ద లాడ్జీలు, హోటళ్లలో బస చేస్తాడు. ఖరీదైన దుస్తులు, పాదరక్షలు ధరించేందుకు ఇష్టపడతాడు. పోలీసులకు పట్టుబడిన సమయంలో 5వేల విలువైన చెప్పులు, 11 వేల విలువైన దుస్తులతో టిప్‌టాప్‌గా తయారై ఉన్నాడు.

అయితే గతంలో ఇతడు ఒక ఇంట్లో చోరికి పాల్పడ్డాడు. అతడు కొట్టేసిన నగలు 10 తులాలైతే.. 20 తులాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు పట్టుబడినపుడు తాను నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవటంతో రూటు మార్చాడు. అప్పటి నుంచి ఎక్కడ దొంగతనం చేసినా ఆ ఇంట్లో కొట్టేసిన నగదు, నగలు వివరాలను చీటీ రాసి అక్కడ ఉంచేవాడు. అదే వివరాలను తన డైరీలో రాసుకునేవాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే తన వద్ద ఉన్న డైరీ చూసి నమ్మించే ప్రయత్నం చేసేవాడు. పగటిసమయంలో కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గమనించేవాడు. అక్కడ చోరీ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేవాడు. అనువుగా ఉన్న ఇంటిని ఎంపిక చేసుకొని రాత్రివేళ చిన్న ఇనుపరాడ్‌ తీసుకుని బయల్దేరేవాడు.

ఇంటితాళం పగులగొట్టి విలువైన వస్తువులు కాజేసి 2022లో మేడిపల్లి పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించి అతన్ని జైలుకు పంపారు. అప్పటికే 94 దొంగతనాలు చేసినట్టు పోలీసు రికార్డుల్లో నమోదయ్యాయి. జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ వరుస చోరీలతో పోలీసులకు సవాల్‌ విసిరాడు. ఓయూ పరిధిలో మూడు, ఉప్పల్, కాచిగూడ, జడ్చర్ల టౌన్, సంగారెడ్డి రూరల్, నాగర్‌ కర్నూల్‌ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున 9 చోట్ల దొంగతనాలు చేశాడు. సెప్టెంబరులో ఓయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని హబ్సిగూడ వీధి నెంబర్‌ 5లో నివాసముండే లగిశెట్టి రాజు ఇంట్లో 19.1తలాల బంగారం, కొన్ని యూఎస్‌ డాలర్లు, కొంత నగదు చోరీ చేశాడు.

బాధితుడి ఫిర్యాదుతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ సేకరించారు. అమీర్‌పేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శంకర్‌నాయక్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి రూ.13.50 లక్షల విలువైన ఆభరణాలు, టూ వీలర్, మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్, విజయవాడ, ఎస్సార్‌నగర్‌లోని ప్రయివేటు ఫైనాన్స్‌ సంసలు, ప్రముఖ బంగారు దుకాణాల్లో తాకట్టు పెట్టినట్టు నిందితుడి వద్ద రశీదులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా అక్కడ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..