Ahmed Bin Abdullah Balala:కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసిన తెలంగాణ ఎమ్మెల్యే.. అసలు కారణం ఇదే..
తెలంగాణ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బీన్ అబ్ధుల్లా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. సుడాన్, ఖార్టూమ్ వార్ జోన్‌లోని భారతీయులను రక్షించి తిరిగి స్వదేశానికి తిరిగి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. కొందరు హైదరాబాద్‌తోపాటు తెలంగాణకు చెందినవారు ఉన్నారని లేఖలో తెలిపారు. ఇందులో మహిళలు, పిల్లలు కలిపి సుమారు 70 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వివరాలను కూడా ఎమ్మెల్యే లేఖకు పొందుపరిచారు.

తెలంగాణ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బీన్ అబ్ధుల్లా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. సుడాన్, ఖార్టూమ్ వార్ జోన్‌లోని భారతీయులను రక్షించి తిరిగి స్వదేశానికి తిరిగి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. కొందరు హైదరాబాద్‌తోపాటు తెలంగాణకు చెందినవారు ఉన్నారని లేఖలో తెలిపారు. ఇందులో మహిళలు, పిల్లలు కలిపి సుమారు 70 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వివరాలను కూడా ఎమ్మెల్యే లేఖకు పొందుపరిచారు. గడిచిన ఏడాది కాలంగా వారు భారతదేశానికి తిరిగి ప్రయాణించడానికి ఎటువంటి సౌకర్యం లేదని తెలిపారు. వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు సహాయం చేయవలసిందిగా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అని లేఖలో ప్రస్తావించారు. కావున, దయతో ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి, మానవతా థృక్పదంతో వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాల్సిందిగా అభ్యర్థిస్తున్నానన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..