Hyderabad: అర్థరాత్రి అనవసరంగా రోడ్లపై తిరిగితే ఇక అంతే.. ‘ఆపరేషన్ చెబుత్ర’ మళ్లీ స్టార్ట్..
Hyderabad: ఎలాంటి అవసరం లేకపోయినా అర్థరాత్రుళ్లు రోడ్లపై తిరుగుతూ కొందరు నానా హంగామా చేస్తుంటారు. మద్యం మత్తులో రెచ్చిపోతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి వారికి...
Hyderabad: ఎలాంటి అవసరం లేకపోయినా అర్థరాత్రుళ్లు రోడ్లపై తిరుగుతూ కొందరు నానా హంగామా చేస్తుంటారు. మద్యం మత్తులో రెచ్చిపోతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఆపరేషన్ చెబుత్రను చేపడుతుంటారు. రాత్రుళ్లు బైక్‌లపై తిరుగుతూ వెకిలి చాష్టలకు పాల్పడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇస్తుంటారు. తాజాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పోలీసులు ఆపరేషన్ చబుత్రను తిరిగి ప్రారంభించారు.
ఇందులో భాగంగా గురువారం రాత్రి ఓల్డ్ సిటీలో పలు చోట్ల పికెటింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై బైక్ ల పై తిరుగుతూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న యువతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఓల్డ్ సిటీ యువత ఎక్కువగా అర్ధరాత్రి జులాయిగా తిరుగుతూ గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసగా మారుతున్నారని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ ఆపరేషన్ తిరిగి మొదలు పెట్టినట్లు తెలిపారు.
అర్ధరాత్రి సమయాల్లో పెట్రోలింగ్ చేస్తూ యువతను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఒకటి రెండు సార్లు కాకుండా ఎక్కువ సార్లు పోలీసులకు పట్టుబడితే తల్లి దండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఓల్డ్ సిటీలో గడిచిన కాలంలో ఆపరేషన్ చబుత్ర మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆపరేషన్ చబుత్రను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..