Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై స్టేషన్ చేరుకోవడం మరింత సులువు..
Hyderabad Metro: కరోనా (Corona) సమయంలో కొన్ని నెలలపాటు నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో సేవలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. చాలా రోజుల పాటు సేవలు ఆగిపోవడంతో నష్టాలు ఎదుర్కొన్న మెట్రోను ఇప్పుడు మళ్లీ...
Hyderabad Metro: కరోనా (Corona) సమయంలో కొన్ని నెలలపాటు నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో సేవలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. చాలా రోజుల పాటు సేవలు ఆగిపోవడంతో నష్టాలు ఎదుర్కొన్న మెట్రోను ఇప్పుడు మళ్లీ దారిలో పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే మెట్రో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు వారి కోసం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మెట్రో స్టేషన్‌లు ఎక్కువగా హైవే పైనే ఉంటాయి. దీంతో లోపల ఉండే వారికి స్టేషన్‌లకు చేరుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే అధికారులు మెట్రోరైడ్ పేరుతో ఈ-ఆటో సేవలను ప్రారంభించారు.
గురువారం పరేడ్‌గ్రౌండ్ స్టేషన్ పార్కింగ్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ సీఈవో ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రోరైడ్ కో–ఫౌండర్ గిరిష్ నాగ్‌పాల్, షెల్ ఫౌండేషన్ ప్రతినిధి తహసీన్ ఆలమ్, డబ్ల్యూ ఆర్ ఐ ఇండియా డైరెక్టర్ పవన్‌తో కలిసి ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రైవేటు ఆటోల్లో ఛార్జీల కంటే కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ-ఆటోల్లో తక్కువగా ఉంటాయి. మొదటి కిలోమీటర్‌కు రూ. 10, తర్వాత ప్రతికీలో మీటర్‌కు రూ. 6 చొప్పున చార్జీలు ఉంటాయి. ఆటోను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు ‘మైట్రోరైడ్ ఇండియా యాప్’ (Metro Ride India)ను డౌన్‌లోడ్ చేసుకోవాలి’అని తెలిపారు.
ఇక మొదట పరేడ్ గ్రౌండ్స్, రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద 50 ఎలక్ట్రికల్ ఆటోలతో ప్రారభించిన సేవలను, దశల వారీ విస్తరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఫేజ్-2లో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైలు సేవలను రూ. 5 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు ప్రణాళికులు సిద్ధం చేశామని వివరించారు.
మరిన్ని హైదరాబాద్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: నాచురల్ స్టార్ నాని-నజ్రియా స్పెషల్ ఫొటోస్…
Covid Fourth Wave: అలెర్ట్ మాస్క్ లేకుంటే మళ్ళీ ఫైన్.. మొదలైన ఫోర్త్ వేవ్ భయాలు..
Health tips: ఈ రెండు తీసుకోండి చాలు.. బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు..! అవేంటంటే..