Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. సమయ వేళలు మారే అవకాశం..

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో త్వరలో సమయ వేళలలో మార్పు చేయనుంది. ఇక నుంచి ఉదయం 6 గంటల నుంచే మెట్రో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. సమయ వేళలు మారే అవకాశం..
Hyderabad Metro
Follow us

|

Updated on: Nov 08, 2021 | 8:19 PM

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో త్వరలో సమయ వేళలలో మార్పు చేయనుంది. ఇక నుంచి ఉదయం 6 గంటల నుంచే మెట్రో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మెట్రో ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా తన ఇబ్బందిని మంత్రి కేటీఆర్‌కి తెలిపారు. స్పందించిన మంత్రి ఆ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డికి ట్యాగ్‌ చేశారు. సదరు ప్రయాణికుడి అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కి ఒక సందేశం పంపారు. అందులో ఈ విధంగా ఉంది. ” ప్రజలు ఉదయం 6 గంటలకు మెట్రో స్టేషన్‌లకు చేరుకుంటున్నారు కానీ 7 గంటల వరకు మెట్రో రైళ్లు సేవలు ప్రారంభమవడం లేదు. ఒక గంట పాటు వేచి ఉండవలసి వస్తుంది. ఒకవేళ క్యాబ్‌లు తీసుకోవడం ద్వారా ఆఫీసులకు చేరుకోవడానికి ప్రయత్నించినా ఖర్చు చాలా అవుతుంది. ఎందుకంటే క్యాబ్‌లు ఉదయాన్నే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల సీనియర్ సిటిజన్లు ఉదయం రద్దీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించేలా చూడాలి” అని మంత్రిని కోరారు. ఫోటోగ్రాఫ్‌లు, వీడియోల శ్రేణిని కూడా ట్వీట్ చేశారు.

ఈ విషయంపై స్పందించిన హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంత్రికి సానుకూలంగా సమాధానమిచ్చారు. సవరించిన సమయాలపై అధికారిక సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉంటుందన్నారు. అయితే ఒక సాధారణ మెట్రో ప్రయాణికుడి అభ్యర్థనకు మంత్రి కేటీఆర్‌ స్పందించడం గొప్ప విషయం. దీంతో సదరు ప్రయాణికుడిని నెటిజన్లు తెగ పొగడుతున్నారు. అంతేకాదు మంత్రి కేటీఆర్‌కి కూడా ధన్యవాదాలు చెబుతున్నారు.

5 లక్షలకు మించి బ్యాంకులో డబ్బులు పెడుతున్నారా..! అయితే ఇలాంటి నష్టాలు కూడా ఉంటాయి..?

Calcium Foods: మీకు పాలు నచ్చకపోతే కాల్షియం అధికంగా ఉండే ఈ ఆహారాలు తినండి..!

Hyderabad: పాతబస్తీలో దారుణం.. అర్ధనగ్నంగా లేడీ డ్యాన్సర్ మృతదేహం.. పక్కనే బీరు బాటిల్..!

Latest Articles
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరికపై మోదీ క్లారిటీ..!
కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరికపై మోదీ క్లారిటీ..!
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?