Hyderabad: సెల్‌ఫోన్ చోరీ కేసులో అరెస్టయ్యాడు.. అతని ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయగా.. వామ్మో..
దాదాపు 5 ఏళ్ల క్రితం ఓ ఇంట్లో దోపిడికి పాల్పడి.. ఆ సొత్తు అంతా తీసుకుని నేపాల్ చెక్కేశాడు. అక్కడ బాగా ఎంజాయ్ చేసి.. తాజాగా సిటీకి రిటన్ వచ్చాడు. ఈసారి సెల్‌ఫోన్ చోరీలకు తెగబడ్డాడు. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయగా.. దోపిడి బాగోతం కూడా వెలుగుచూసింది.

ఐదేళ్ల క్రితం దోపిడీ చేశాడు ఓ నేరస్తుడు. ఆపై ఎంచక్కా మరో దేశానికి చెక్కేశాడు.. సంవత్సరాలు గడిచాయి… తిరిగి సొంత ప్రాంతంలోకి అడుగుపెట్టాడు… నన్ను ఎవరు గుర్తుపడతారులే, ఎప్పుడో చేసిన దోపిడి కదా అనుకున్నాడు. అయితే పాత నేరస్తుల చిట్టాపై ఫోకస్ పెట్టిన పోలీసులు… ఫింగర్ ప్రింట్స్ పరిశీలిస్తున్నటువంటి సమయంలో ఐదేళ్ల క్రితం ఇతగాడు దోపిడీ చేసినట్లు గుర్తించి.. లోపలేశారు. ఇప్పటికి అతనిపై ఇప్పటివరకు 14 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇంతకీ ఆ దొంగను ఐదు సంవత్సరాల తర్వాత పోలీసులు ఏ విధంగా పట్టుకున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
2019 డిసెంబర్లో జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఓ దొంగ కత్తితో బెదిరింపులకు పాల్పడి ఇంట్లో ఉన్నటువంటి నగదుతో పాటు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఆ తర్వాత నేపాల్ పారిపోయినటువంటి నేరస్థుడు గోవింద్ బండారి ఐదేళ్ల తర్వాత తిరిగి హైదరాబాద్‌కి వచ్చాడు. అయినా బుద్ధి మార్చుకోకుండా ఈసారి రూటు మార్చి సెల్ఫోన్ చోరీలకు తెగబడ్డాడు. సెల్ ఫోన్ చోరీ కేసులో భాగంగా గోవిందు బండారిని ఎస్ఆర్ నగర్ పోలీసులు ఇటీవల కాలంలో అరెస్టు చేశారు. నిందితుడి వద్ద సేకరించినటువంటి వేలిముద్రలు ఫింగర్ ప్రింట్ బ్యూరోలో రికార్డు చేశారు.
ఆల్రెడీ అతని ఫింగర్ ప్రింట్స్ దోపిడి కేసు సందర్భంగా రికార్డు అయి ఉండటంతో.. ఆ వ్వవహారం కూడా ఇప్పుడు బయటపడింది. ప్రజంట్ సెల్ ఫోన్ చోరీలో పట్టుబడి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నేరస్థుడు గోవింద్ మరోసారి నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే గోవింద్ 14 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా టెక్నాలజీ ద్వారా ఓ కరుడుగట్టిన నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
