AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఛీ.. ఛీ.. మీరేం మనుషులురా.. బాలిక హత్య కేసులో విస్తుపోయే నిజాలు

హైదరాబాద్ మాదన్నపేటలో సంచలనం సృష్టించిన 7 ఏళ్ల బాలిక హత్య కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. బాలిక హత్య కేసులో ఆమె మేనమామే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. మృతురాలి మేనమామతో పాలు అతని భార్యను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు పోలీసులు.

Hyderabad: ఛీ.. ఛీ.. మీరేం మనుషులురా.. బాలిక హత్య కేసులో విస్తుపోయే నిజాలు
Hyderabad News
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 04, 2025 | 9:39 PM

Share

హైదరాబాద్ మాదన్నపేటలో సంచలనం సృష్టించిన 7 ఏళ్ల బాలిక హత్య కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. ఉమేని సుమయ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆమె మేనమామేనని గుర్తించారు. అనారోగ్యంతో తమ కుమార్తె మృతి చెందడానికి సమయ తల్లిదండ్రులు చేతబడి చేయించడమే కారణమని.. కక్ష పెంచుకున్న బాలిక మేనమామ సమీ అలీ, అతని భార్య యాస్మిన్‌ బేగం సమయను అతి దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. ఈ కేసులో బాలిక మేనమామ అలీతో పాటు అతని భార్యను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. షబానా బేగం, అజ్ముద్దీన్‌ ఫారూక్‌ దంపుతులు సంతోష్‌నగర్‌లో నివాసముంటున్నారు. షాబానా బేగం సోదరుడు సమీ అలీ, తన భార్య, తల్లితో కలిసి మాదన్నపేట్‌లోని చావ్‌నీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తరచు బాలిక సుమయ మేనమామ అలీ ఇంటికి వెళ్లేది. అప్పటికే ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. అయితే ఇటీవలే అలీ చిన్న కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. అయితే తన కుమార్తె మృతి చెందడానికి తన సోదరి షబానా కారణమని అలీ భావించాడు.

దీంతో సుమయ ఉత్సహంగా ఉండడం జీర్ణించుకోలేకపోయిన అలీ దంపతులు.. బాలికను అంతమొందించి వాళ్ల తల్లిదండ్రులకు కూడా కడుపుకోత మిగిల్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే బాలిక హత్యకు ప్లాన్ చేశారు. అయితే గత నెల 28 సుమయ.. మేనమాన అలీ ఇంటికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన అలీ దంపతులు బాలికను డాబా మీదకు తీసుకెళ్లి చేతులు తాళ్లతో కట్టేసి. మూతికి ప్లాస్టర్‌ అతికించి నీటి ట్యాంకు పడేశారు. తర్వాత ట్యాంకు మీద మూత మూసి దానిపై బండరాయి పెట్టారు. దీంతో ఊపిరాడక బాలిక మృతి చెందింది.

అయితే ఆడుకుంటానని మేనమామ ఇంటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తమ మీద అనుమానం రాకుండా అలీ దంపతులు కూడా బాలికకోసం వెతినట్టు నాటకం ఆడారు. అయితే సీసీ కెమారాలు పరిశీలించిన పోలీసులు బాలిక ఇంటి నుంచి బయటకు రాలేదని గమనించారు. అనుమానంతో మేనమామ అలీ దంపతులను విచారించగా తామే సుమయను హత్య చేశామని బయటపెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మేనమామ సమీ అలీ అతని భార్య యాసిన్‌ బేగంను అరెస్టు చేశారు.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.