AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YIPS Admissions 2026: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో 1వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం.. సామాన్యులకూ ఛాన్స్‌!

Young India Police School Admissions 2026: రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును సమగ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, చదువుతో పాటు క్రీడలు, ఉన్నత విలువలతో పాటు నైపుణ్యత, వ్యక్తిత్వ వికాసంతో పాటు అత్యుత్తమ బోధన అందించే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో గ్రేడ్ 1 నుండి 6 వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరానికి..

YIPS Admissions 2026: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో 1వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం.. సామాన్యులకూ ఛాన్స్‌!
Young India Police School Admissions
Srilakshmi C
|

Updated on: Oct 05, 2025 | 6:09 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5: తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును సమగ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, చదువుతో పాటు క్రీడలు, ఉన్నత విలువలతో పాటు నైపుణ్యత, వ్యక్తిత్వ వికాసంతో పాటు అత్యుత్తమ బోధన అందించే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో గ్రేడ్ 1 నుండి 6 వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరానికి హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS)లో 1 నుండి 6 తరగతుల విద్యార్థుల కోసం ఈ అడ్మిషన్లను ప్రారంభించారు. మంచిరేవులులోని నార్సింగిలో ఉన్న ఈ పాఠశాలలో 50 శాతం సీట్లు పోలీసు సిబ్బంది పిల్లలకు రిజర్వ్ చేయబడ్డాయి, మిగిలిన సీట్లు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

ఈ స్కూల్‌లో విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా అకడమిక్, స్పోర్ట్స్, కో-కరిక్యులర్ కార్యక్రమాలు సమన్వయంతో కొనసాగుతున్నాయి. క్రమశిక్షణ, విలువలపై దృష్టి పెట్టడంతో పాటు, పిల్లలలో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 1న వైప్స్ బ్రోచర్ మరియు అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ పాఠశాల పోలీసు సిబ్బంది, పోలీసు అమరవీరులు, అగ్నిమాపక సేవలు, ఎక్సైజ్, ప్రత్యేక పోలీసు దళం, జైలు శాఖ అధికారుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మరో 28 “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

YIPS ఏర్పాటు ప్రతిపాదనను రేవంత్ రెడ్డి గత ఏడాది అక్టోబర్ 21న తొలిసారి ప్రకటించారు. ఈ సంస్థ వినూత్న అభ్యాస పద్ధతులపై దృష్టి సారిస్తుంది. విద్యార్థులు సమగ్ర శారీరక శిక్షణ, పోటీతత్వ అనుభవం, సరసమైన ఫీజులతో ప్రపంచ స్థాయి సౌకర్యాలను పొందేలా చేస్తుంది. ఇందులో నివాస సౌకర్యాలు, క్రీడా సముదాయం కూడా ఉంటాయి. ఆసక్తి గల తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం yipschool.in వెబ్‌సైట్‌ను లేదా 9059196161 నెంబర్‌ను సంప్రదించవచ్చును.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్