Hyderabad: పాతబస్తీలో గ్యాంగ్ వార్.. హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్లతో బీభత్సం..
పాతబస్తీలో మరోసారి గ్యాంగ్ వార్ టెన్షన్ క్రియేట్ చేసింది. యువకులు రెండు గ్యాంగ్‌లుగా విడిపోయి, గొడవకు దిగడం కలకలం రేపింది.
Gang war in Old City: హైదరాబాద్ పాతబస్తీలో రెండు గ్యాంగ్‌లు హల్ చల్ చేశాయి. హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్లతో హంగామా సృష్టించారు. ఈ ఘటన 6వ తేదీ అర్ధరాత్రి జరిగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంతోష్ నగర్ (Santosh Nagar) పోలీసు స్టేషన్ పరిధిలోని రియసత్ నగర్, ఫిసల్ బండాలో, మాయా గ్యాంగ్, సమీర్ గ్యాంగ్ గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని రెండు గ్యాంగ్‌లను చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. తల్వార్‌లు, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా మిగతావారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఆధిపత్య పోరుతోనే ఈ గ్యాంగ్‌ల మధ్య వార్ జరిగినట్టు చెబుతున్నారు పోలీసులు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నారు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య. యువకుల కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే, కఠిన చర్యలు తప్పవని డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాతబస్తీలో యువకులు మారకపోతే వారిపైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఘటన తర్వాత అర్ధరాత్రి పూట పాతబస్తీలో గస్తీ మరింత పెంచినట్టు వెల్లడించారు పోలీసులు ఉన్నతాధికారులు. ఎలాంటి సమస్యలు తలెత్తినా తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పాతబస్తీ ఏరియాలో ఇలా తరుచూ గ్యాంగ్ వార్‌లు జరగడం చర్చకు దారి తీసింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, గ్యాంగ్ వార్‌లు ఆగడం లేదు. అర్ధరాత్రిళ్లు గొడవలకు దిగే వారిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు.
Also Read: