AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫ్రెష్ అనుకొని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే యాక్ తూ అంటారు..

బ్లాంకెట్‌ తీయగానే బ్లింక్‌ ఇట్‌లో ఆర్డర్‌ చేస్తున్నారా...! ఫ్రెష్‌గా ఉంటాయంటూ అమెజాన్‌ ఫ్రెష్‌లో తెగ కొనేస్తున్నారా...! బిగ్‌ సేల్‌ అనగానే బిగ్‌ బాస్కెట్‌కి బెండైపోతున్నారా...! అయితే ఈ వార్త మీకోసమే...! పక్కా సమాచారం, పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ-కామర్స్‌ స్టోర్స్‌పై విరుచుకుపడ్డ GHMC ఫుడ్‌ సేఫ్టీ అధికారులు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు.

Hyderabad: ఫ్రెష్ అనుకొని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే యాక్ తూ అంటారు..
Hyderabad Food Safety Raid
Shaik Madar Saheb
|

Updated on: Aug 01, 2025 | 6:10 PM

Share

జెప్టో, అమెజాన్‌ ఫ్రెష్‌, బ్లింకిట్‌, బిగ్‌బాస్కెట్‌, స్విగ్గీ, జొమాటోతోపాటు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ స్టోర్స్‌లో ఆకస్మిత తనిఖీలు చేపట్టారు అధికారులు.. కాలంచెల్లిన ఆహార పదార్థాలతో పాటు స్టోర్స్‌లో బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు. FSSAI నిబంధనలకు విరుద్ధంగా స్టోర్స్‌ని నిర్వహిస్తున్నట్లు తేల్చారు. అలాగే మరికొన్ని స్టోర్స్‌కి అసలు మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్ లేనట్లు గుర్తించారు. నగరవ్యాప్తంగా మొత్తం 37 స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 69 శాంపిల్స్ సేకరించారు. టెస్ట్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌కి పంపారు. ల్యాబ్‌ పరీక్షల ఆధారంగా ఆయా కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.

ఇదిలా ఉండగా.. ఫుడ్‌ సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను పాటించడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఈ–కామర్స్‌ సంస్థలను FSSAI ఇటీవలే హెచ్చరించింది. ఉల్లంఘనల విషయంలో కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. స్టోరేజ్‌ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రత ప్రొటోకాల్స్‌ పక్కాగా పాటించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ స్టోర్స్‌లో నిబంధనలు గాలికొదిలేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..