Hyderabad: యువతి వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్.. కట్ చేస్తే.. చివరకు ఏమైందో తెలుసా?
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో యువతులకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఫొటోలను అసభ్యకరంగా పోస్ట్ చేయడం, వారిపై ఆరోపణలు చేస్తూ రాయడం, అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి రోజురోజుకు పెరుగుతున్నాయి. అలాంటి వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా.. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న ఓ మహిళ వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ పోస్ట్ చేసిన నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్, అక్టోబర్ 28: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో యువతులకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఫొటోలను అసభ్యకరంగా పోస్ట్ చేయడం, వారిపై ఆరోపణలు చేస్తూ రాయడం, అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి రోజురోజుకు పెరుగుతున్నాయి. అలాంటి వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా.. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న ఓ మహిళ వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ పోస్ట్ చేసిన నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో, యూట్యూబ్‌లో 1.6 మిలియన్ల ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. ఆమెకు మొత్తం ఐదు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇటీవల ఆ యువతి తన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసి ట్రెండింగ్‌లో కి వచ్చింది. దీంతో ఓ కేటుగాడు ఆ యువతి వీడియోలను అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ మార్ఫింగ్ వీడియోలను ట్యాగ్ చేస్తూ ఆమె అభిమానులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెటిజన్ల నుంచి ఫిర్యాదులు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు. భూక్య రమేష్ అనే వ్యక్తి తన ట్విట్టర్ హ్యాండిలలో ఈ రకమైన అసభ్యకరంగా వీడియోలను పోస్ట్ చేస్తూ దాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక్కో మార్ఫింగ్ వీడియోలను రమేష్ 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఫుల్ వీడియో కావాలంటే ఫలనా నంబర్‌కు ఫోన్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ పెడితే వీడియో పూర్తిగా పెడతానంటూ భూక్య రమేష్ నమ్మబలికాడు. దీంతో చాలామంది ఆయన అకౌంట్లోకి డబ్బులు వేశారు. ఇలా ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలో దిగి భూక్య రమేష్ ను అదుపులోకి తీసుకొని ఆయన ఎకౌంట్లను ఫ్రిజ్ చేశారు.
రమేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐటి యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. శుక్రవారం రమేష్ ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. అమాయక మహిళల వీడియోలను మార్ఫింగ్ చేసి సొమ్ము చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోల ద్వారా యువతులను వేధింపులకు గురి చేస్తే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
