John Stephen DSouza Arrest: గోవా డ్రగ్స్ కింగ్ పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్‌ను అరెస్ట్ చేశారు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఆగష్టు 16న బాబు అలియాస్ కాళీని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతను నుంచి కీలక సమాచారం రాబట్టారు. పోలీసుల ఇన్వెస్ట్‌గేషన్ కాళీ చెప్పిన ఏడుగురి డ్రగ్స్ స్మగ్లర్ల గురించి అన్వేషించారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న డ్రగ్ కింగ్ స్టీఫెన్ డీసౌజాను గోవా పోలీసులు సహకారంతో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్టీఫెన్ దగ్గర దేశ వ్యాప్తంగా 600మంది డ్రగ్స్ కస్టమర్లు లిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. వారిలో హైదరాబాద్ కు చెందిన వారు 168 మంది ఉన్నట్లు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తెలిపింది.
గోవా కేంద్రంగా హిల్ టాప్ రెస్టారెంట్‌లో డ్రగ్స్ డెన్ ఉన్నట్లు చెప్పారు ఈస్ట్ జోన్ డీసీపీ. 1983 నుండి నడుస్తున్న హిల్ టాప్ పబ్బులో ప్రతి శుక్రవారం స్పెషల్ పార్టీలు.. ట్రాన్స్ మ్యూజిక్ పార్టీ లు జరుగుతాయన్నారు. పార్టీల్లో పాల్గొన్న టూరిస్ట్‌లు డ్రగ్స్ తీసుకోవడం.. కొనుగోలు చేయడం చేస్తున్నట్లు ఎంక్వైరీలో తేలిందన్నారు పోలీసులు. డ్రగ్స్ ను స్టీవ్ ఏజెంట్లు అమ్మకాలు చేస్తున్నారని చెప్పారు. పూర్తి వివరాలతో స్టీవ్ ను అరెస్ట్ చేసి గోవా కోర్టులో హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు చెప్పారు ఈస్ట్ జోన్ డీసీపీ. త్వరలోనే డ్రగ్స్ మాఫియాపై మరింత సమచారం తెలియజేస్తామని వెల్లడించారు.
కాగా హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, బెంగుళూరు, చెన్నైకి కూడా స్టీఫెన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నార్కొటిక్స్ వింగ్ ఇదివరకే గుర్తించింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని.. వారి ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తూ వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. తొలుత డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిని అరెస్ట్ చేసి, అక్కడి నుంచి మెల్లగా కూపీ లాగగా.. విచారణలో అసలు నిజాలు వెలుగుచేశాయి. కాలేజీలు, స్కూల్స్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు అధికారులకు తెలియడంతో పలువురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే టోనీ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ జాన్ స్టీఫెన్ డీసౌజాను అరెస్ట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.