Hyderabad: రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. ఆ కేసులో అసలు విషయం బయటపెట్టిన భార్య.. సీన్ కట్ చేస్తే..
స్నేహితులైన మహ్మద్ తఖీ (22), మహ్మద్ హసన్ (24) చాంద్రాయణగుట్ట న్యూఇందిరానగర్లో గతంలో ఒకే ఇంట్లో నివసించే వారు . టైల్స్ కటింగ్ పనిచేస్తూ వీరిద్దరూ జీవించేవారు.
Hyderabad News: చోరీ సొత్తు పంపకాల్లో విభేదాలు రావడంతో ఓ వ్యక్తి.. స్నేహితుడినే దారుణంగా హతమార్చాడు. మృత దేహాన్ని మూడు ముక్కలు చేసి నగర శివార్లలో పడేశాడు. హైదరబాద్‌లో నాలుగేళ్ల క్రితం ఈ దారుణం చోటుచేసుకోగా అనూహ్యరీతిలో ఇప్పుడు వెలుగు చూసింది. చాంద్రాయణగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. స్నేహితులైన మహ్మద్ తఖీ (22), మహ్మద్ హసన్ (24) చాంద్రాయణగుట్ట న్యూఇందిరానగర్లో గతంలో ఒకే ఇంట్లో నివసించే వారు . టైల్స్ కటింగ్ పనిచేస్తూ వీరిద్దరూ జీవించేవారు. జల్సాలకు అలవాటుపడిన వీరిద్దరూ చోరీల బాట పట్టారు. భర్త చనిపోవడంతో పాతబస్తీకి వచ్చి ఉంటున్న.. ఓ మహిళతో తఖీకి పరిచయం అయింది. దీంతో తఖీ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె మతం మార్చి ఆయేషాబేగంగా పేరు పెట్టాడు. ఆయేషా, తఖీ, హసన్లు ఒకే ఇంట్లోని వేర్వేరు గదుల్లో నివసించే వారు. తరువాత వీరు హాషామాబాద్కు.. ఆ తరువాత బండ్లగూడ గౌస్నగర్ వీకర్ సెక్షన్ కాలనీకి మకాం మార్చారు.
2018లో ఓ ఇంట్లో చోరీ చేసిన సొత్తును పంచుకునే విషయంలో తఖీ, హసన్ ల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో కక్ష పెంచుకున్న తఖీ తన ఇంట్లో నిద్రిస్తున్న హసన్‌ను హత్య చేశాడు. మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి శివారులోని జల్పల్లి చెరువు, మైలార్ వుపల్లి సమీపంలోని పల్లెచెరువు, బాలాపూర్ ఠాణా పరిధుల్లో పడేశాడు. ఇదంతా ఆయేషా బేగం కళ్ల ముందే జరిగింది. హసన్ అదృశ్యంపై న్యూఇందిరా నగర్లో ఉండే తల్లిదండ్రులు 2018 లోనే చాంద్రాయణగుట్ట పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటికే తఖీ, అతని భార్య ఇద్దరు రక్తపు మరకలను శుభ్రం చేసి.. గోడలకు పేయింట్ వేశారు. అనంతరం అక్కడి నుంచి మకాం మార్చారు.
తాజాగా.. హసన్‌కు, ఆయేషాను వేధించడం పెట్టడం ప్రారంభించాడు. రెండో పెళ్లికి ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెట్టేవాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకుంటానని తఖీ.. చెప్పడంతో భార్య అభ్యంతరం చెప్పింది. జులై 20 లోగా తన రెండో నిఖాకు ఒప్పుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆయేషా ఓ స్నేహితుడిని సంప్రదించి తన సమస్యల గురించి చర్చించింది. అదే సమయంలో ఆమె హసన్ హత్య గురించి వెల్లడించింది. అనంతరం చాంద్రాయణగుట్ట పోలీసుల వద్దకు వెళ్లి.. ఆయేషా హత్యోదంతాన్ని బయటపెట్టింది.
పోలీసులు విచారణలో తఖీ నేరాన్ని అంగీకరించాడు. తఖీ, హసన్లపై మైలారేవుపల్లి , పహాడీషరీఫ్, బాలాపూర్ ఠాణాల పరిధుల్లో పలు చోరీ కేసులున్నాయి. హత్యకు చోరీ సొత్తు పంపకంలో వివాదమా.. వివాహేతర సంబంధం కారణమా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని చంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తఖీతోపాటు మరొకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
-నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి