Rain Alert: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌

|

Oct 06, 2024 | 4:45 PM

హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. బహదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేటలో వర్షం రికార్డు స్థాయిలో కురిసింది. మేడ్చల్‌, కండ్లకోయ, కృష్ణాపూర్‌, దుండిగల్‌, ప్రగతినగర్‌, గండిమైసమ్మ, గాగిల్లాపూర్‌లతోపాటు..

Rain Alert: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌
Rain Alert
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6: హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. బహదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేటలో వర్షం రికార్డు స్థాయిలో కురిసింది. మేడ్చల్‌, కండ్లకోయ, కృష్ణాపూర్‌, దుండిగల్‌, ప్రగతినగర్‌, గండిమైసమ్మ, గాగిల్లాపూర్‌లతోపాటు ప్యారడైజ్‌, చిలుకలగూడ, వారాసిగూడతో పాటు పలుచోట్ల వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశ నుంచి గంటకు ఆరు నుంచి పది కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పింది.

నేడు, రేపు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. సోమవారం నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లి్‌క్‌ చేయండి.