తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో వాతావరణమంతా మారిపోయింది. రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఉరుములు, మెరుపులు భారీగా ఉన్నాయి. కూకట్‌పల్లి, అమీర్‌పేట, మూసాపేటలో వర్షం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లిలలో భారీ వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో పొద్దంతా దంచికొట్టిన ఎండలు.. దాదాపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు నమోదు అవుతున్నాయి.
రాత్రికి పలుచోట్ల కురిసిన వర్షంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. భాగ్యనగరాన్ని మబ్బులు కమ్మేయగా…నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్‌లో వాతావరణం మారిపోయింది. గత నాలుగు రోజులుగా పొద్దంతా ఎండలు దంచికొట్టాయి. దాదాపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాంతో జనమంతా ఎండవేడి నుంచి ఉపశమనం కలిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి