AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉదయాన్నే అసలేం జరిగింది..? గుల్జార్ హౌస్ ప్రమాదానికి అనేక కారణాలు.. కేసు నమోదు

ఓల్డ్‌ సిటీ అగ్నిప్రమాదంతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంటల్లో 17 మంది మృతిచెందడం యావత్‌ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టింది. చిన్నారులు సైతం ప్రమాదంలో చనిపోవడం కలిచివేస్తోంది. కాగా.. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు అయింది. చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో ఉత్కృష్ మోడీ బంధువు ఫిర్యాదు చేశారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు.

Hyderabad: ఉదయాన్నే అసలేం జరిగింది..? గుల్జార్ హౌస్ ప్రమాదానికి అనేక కారణాలు.. కేసు నమోదు
Hyderabad Fire Accident
Shaik Madar Saheb
|

Updated on: May 19, 2025 | 9:21 AM

Share

ఓల్డ్‌ సిటీ అగ్నిప్రమాదంతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంటల్లో 17 మంది మృతిచెందడం యావత్‌ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టింది. చిన్నారులు సైతం ప్రమాదంలో చనిపోవడం కలిచివేస్తోంది. కాగా.. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు అయింది. చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో ఉత్కృష్ మోడీ బంధువు ఫిర్యాదు చేశారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. 6:45 కు సమీప బంధువు ఫోన్ చేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు.. తాము ము హుటాహుటిన వెళ్ళి చూసేసరికి ఫైర్ సిబ్బంది సహాయకచర్యలో ఉన్నారన్నారు. 17 మంది అపస్మారక స్థితిలో ఉన్నవారిని బయటికి తీసి హాస్పిటల్‌కు తరలించారని తెలిపారు. వీరితో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కృష్ణ పెరల్స్, మోడి పెరల్స్ షాప్‌లు పూర్తిగా దగ్ధం అయ్యాయన్నారు. అగ్ని ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేయాలని మృత్యుల బంధువు కోరారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న చార్మినార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా విచారణకు ఆదేశించారు. అయితే.. అసలీ మంటల వెనుక మర్మమేంటి..? షార్ట్‌ సర్క్యూటేనా..? మరేమైనా కారణాలున్నాయా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి..

17 నిండు ప్రాణాలను బలితీసుకున్న చార్మినార్ గుల్జార్​ హౌస్‌‌ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి ? అధికారులు ఎంతగానో శ్రమించినా.. అంతమంది ఎందుకు చనిపోయారు ? ఇంట్లో మంటలు అంతలా ఎలా వ్యాపించాయి ? అనే విషయాలపై  అధికారులు క్లారిటీ ఇచ్చారు.

  1. అగ్ని ప్రమాదంతో పెను విషాదాన్ని మిగిల్చిన గుల్జార్ హౌస్‌‌ ఇంట్లో తరచూ విద్యుత్ సమస్యలు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
  2. ప్రమాదంలో అంతగా మంటలు వ్యాపించడానికి అసలు కారణం.. ఇంట్లో చెక్కతో చేసిన ప్యానెళ్లు ఎక్కువగా ఉండటమే. షార్ట్ సర్క్యూట్‌తో చెక్క మొత్తం కాలి మంట‌లు వ‌చ్చాయ‌ని అధికారులు చెప్పారు.
  3. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడమే ప్రమాదానికి కారణం. ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతోపాటు, ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు.
  4. ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండటానికి మరో ప్రధాన కారణం ఈ బిల్డింగ్‌కు ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేకపోవడమే అని తెలుస్తోంది. ఇది పాత భవనం కావడంతో ఇందుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని సమాచారం.
  5. ప్రమాదం జరిగిన తరువాత బాధితులు బయటకు వచ్చేందుకు తగిన మార్గాలు లేకపోవడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణంగా తెలుస్తోంది. భవనం పైనుంచి కిందికి రావాలంటే ఒకటే దారి ఉండటంతో బాధితుల్లో ఎక్కువమంది బయటకు రాలేకపోయారు.
  6. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ వేగంగా స్పందించింది. అయితే మంటల వ్యాపించిన ఇంట్లోకి వెళ్లడానికి వారికి కూడా సరైన మార్గం లేకుండా పోయింది. ఇంట్లోకి వెళ్లడానికి ఇరుకైన మెట్లు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగేలా చేసింది.
  7. ప్రమాదం కారణంగా లోపల ఇరుక్కుపోయిన బాధితులను రక్షించేందుకు షట్టర్‌తో పాటు గోడ బద్దలుగొట్టాకే లోపలికి వెళ్లాల్సి వచ్చింది. దీన్ని బట్టి భవనంలోకి వెళ్లడం ఎంత కష్టంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
  8. ఇక భవనం బయటకు జీ-ప్లస్‌-వన్ ఉన్నట్టుగా కనిపించినా.. లోపల జీ ప్లస్ 2 ఉంది. దీంతో అందులో ఎక్కువమంది ఉన్నారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈ సహాయక చర్యలలో ఆధునిక సాంకేతిక పరికరాలు అడ్వాన్స్‌డ్ ఫైర్ రోబో .. బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు.
  9. ప్రమాదం జరిగిన తరువాత అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. అయితే మెట్లపై నుంచి కూడా మంటలు వ్యాపించడంతో సహాయక చర్యల్లో కొంత జాప్యం జరిగినట్టు తెలుస్తోంది.
  10. అగ్నిప్రమాదం నుంచి బాధితులు తప్పించుకోవడానికి మరో మార్గం ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. టెర్రస్ దగ్గర మెట్లకు తాళం వేసి ఉండటంతో.. బాధితులు బయటకు వెళ్లలేకపోయారు. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..