Hyderabad: హైదరాబాద్ రోడ్లపై సడెన్‌గా ప్రత్యక్షమైన జింక.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
హైదరాబాద్ గచ్చిబౌలి-లింగంపల్లి ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అటవి ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఓ జింక రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక గాయపడింది. సమాచారం అందుకున్న HCU యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, గాయపడిన జీంకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి బయటకొచ్చిన ఓ జింక రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొట్టిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జింక కారును బలంగా ఢీకొట్టడంతో.. అది గాయపడింది. ఈ కారణంగా రోడ్డు కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న HCU యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, గాయపడిన జీంకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. HCU క్యాంపస్ చుట్టూ 240 ఎకరాల అటవి ప్రాంతం ఉండటంతో జింకలు, నెమళ్ళు వంటి వన్యప్రాణులు తరచూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్‌కు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ జింక అటవీ నుంచి బయటకు వచ్చి ఏకంగా ఓల్డ్ ముంబై రహదారిపై వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జింక రోడ్డు మధ్య పడిపోవడంతో చుట్టూ వాహనాలు ఆగి, కొంతమేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అలర్ట్ అయిన HCU యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని జింకను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించ్చారు.
HCU చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో ఇలాంటి జంతు-వాహన ఆక్సిడెంట్ ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గతంలో కూడా జీంకలు, ఇతర జంతువులు బయటకు వచ్చి ప్రమాదాలు సృష్టించాయి. సరైన ఫెన్సింగ్ లేకపోవడం వల్లే తరచూ ఇలా వణ్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. రహదారి వెంబడి వార్నింగ్ సైన్ బోర్డులు, స్పీడ్ లిమిట్లు, నైట్ పెట్రోలింగ్ పెంచాలని సూచనలు చేస్తున్నారు.
గచ్చిబౌలి, HCU, లింగంపల్లి మధ్య రహదారిపై రాత్రి, ఉదయం వేగం తగ్గించి వెళ్లాలి, జంతువులు ఉండే అవకాశం ఉందని డ్రైవర్లకు అవగాహన కల్పించాలి. అలాంటి ఘటనలు గమనించినప్పుడు వెంటనే HCU యానిమల్ ప్రొటెక్షన్ టీమ్ (040-23094501) లేదా ఫారెస్ట్ హెల్ప్‌లైన్‌కు సంప్రదించాలి. వన్యప్రాణుల రక్షణతో పాటు మానవ జీవన రక్షణ కోసం అటవీ-అర్బన్ ప్రాంతాల మధ్య సమతుల్యత అవసరమని నిపుణులు చెపుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
