కరోనా భయం.. వృద్ధ దంపతుల గెంటివేత..!

కరోనా భయం రోజు రోజుకు ఎక్కువవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఇప్పటికే 7వేలకు పైగా ప్రాణాలను తీసుకుంది. బాధితుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది.

కరోనా భయం.. వృద్ధ దంపతుల గెంటివేత..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 18, 2020 | 7:38 AM

కరోనా భయం రోజు రోజుకు ఎక్కువవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఇప్పటికే 7వేలకు పైగా ప్రాణాలను తీసుకుంది. బాధితుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే కరోనా భయంతో వృద్ధ దంపతులను అపార్ట్‌మెంట్ నుంచి గెంటివేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నగరంలోని అల్వాల్‌లో ఓ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన వృద్ధ దంపతులు ఇటీవలే విదేశాలకు వెళ్లి నగరానికి వచ్చారు. అయితే విదేశాలకు వెళ్లి వచ్చిన చాలామందిలో కరోనా లక్షణాలు బయటపడుతుంటంతో.. ఈ వృద్ధ దంపతులను అపార్ట్‌మెంట్ నుంచి వెళ్లిపోవాలని అక్కడి వారు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌ నుంచి వారిని బయటకు గెంటేశారు. దీంతో బిక్కుబిక్కుమంటూ ఆ వృద్ధ దంపతులు అపార్ట్‌మెంట్‌ బయట కూర్చున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu