పదో తరగతి పరీక్షలు: కలెక్టర్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు గుడ్ న్యూస్..

Coronavirus Outbreak: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు గుడ్ న్యూస్ అందిస్తూ.. పరీక్షకు 5 నిమిషాలు(ఉదయం 9. 35) ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తామని ప్రకటించారు. అయితే ముందుగానే పరీక్షా కేంద్రంలోకి రావాలని సూచించారు. ఇక విద్యార్థులు గుంపులు, గుంపులుగా రావొద్దని.. ప్రొటెక్షన్ మాస్క్ వేసుకుంటే మంచిదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, మార్చి 19 నుంచి […]

పదో తరగతి పరీక్షలు: కలెక్టర్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Mar 19, 2020 | 7:09 AM

Coronavirus Outbreak: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు గుడ్ న్యూస్ అందిస్తూ.. పరీక్షకు 5 నిమిషాలు(ఉదయం 9. 35) ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తామని ప్రకటించారు. అయితే ముందుగానే పరీక్షా కేంద్రంలోకి రావాలని సూచించారు. ఇక విద్యార్థులు గుంపులు, గుంపులుగా రావొద్దని.. ప్రొటెక్షన్ మాస్క్ వేసుకుంటే మంచిదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు సుమారు 2,530 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ 19 పంజా విసురుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సుమారు 5,34,903 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్‌కు హాజరు కానున్నారు. ఇక అటు పరీక్షల నిర్వహణలో 30,500 మంది ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు 144 సిట్టింగ్‌ స్క్వాడ్స్, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఆమీర్‌పేట్‌లోని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల మూసివేత…

రేపిస్టు భార్యగా ఉండలేను.. విడాకులు కావాలి..

కరోనా ప్రభావం.. ఐదు లక్షల రెస్టారెంట్లు బంద్…

కరోనా వైరస్ ప్రభావం.. టీఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..