గిచ్చి.. సస్పెండ్ అయ్యాడు..!

విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై వేటు పడింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న విచారణ చేపట్టి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. పాతబస్తీ చార్మినార్ వద్ద మెడికల్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేశ్‌పై వేటు పడింది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ నుంచి ఆయుర్వేద హాస్పిటల్‌ని తరలించవద్దంటూ వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్ ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. […]

గిచ్చి.. సస్పెండ్ అయ్యాడు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 01, 2019 | 6:31 PM

విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై వేటు పడింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న విచారణ చేపట్టి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. పాతబస్తీ చార్మినార్ వద్ద మెడికల్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేశ్‌పై వేటు పడింది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ నుంచి ఆయుర్వేద హాస్పిటల్‌ని తరలించవద్దంటూ వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్ ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే.. అక్కడ మహిళా పోలీసులు ఉన్నా.. మగ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించారు.