Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక.. ఎక్కడో తెలుసా?

Hyderabad: హోటల్లో బిర్యానీ తినేందుకు ఒక పదిమంది గ్రూప్ కలిసి రోడ్ నెంబర్ 3 లో ఉన్న హోటల్ కి వెళ్లారు. అక్కడ బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమవడంతో కస్టమర్లు కంగారుపడ్డారు. వెంటనే అక్కడ ఉన్న హోటల్స్ సిబ్బందికి బొద్దింకను చూపించి ప్రశ్నించారు..

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక.. ఎక్కడో తెలుసా?
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Subhash Goud

Updated on: Nov 28, 2024 | 7:59 PM

హైదరాబాద్‌లో ఇటీవల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లు, ఇతర హోటళ్లపై తనిఖీలు చేపడుతున్నారు. చాలా హోటళ్లలను అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలు, చెడిపోయిన పదార్థాలు వెలుగు చూడటంతో అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. అలాంటి హోటళ్లపై అధికారులు కేసులు నమోదు చేస్తూ సీజ్‌ చేస్తున్నారు. హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంత పగడ్బందీగా తనిఖీలు చేస్తున్నా కొంతమంది హోటల్స్ నిర్వహకుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న బిర్యాని వాలా హోటల్లో బిర్యానీలో ఏకంగా బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో ఒకసారి గా కస్టమర్లు కంగుతిన్నారు.

బిర్యానీ వాలా హోటల్లో బిర్యానీ తినేందుకు ఒక పదిమంది గ్రూప్ కలిసి రోడ్ నెంబర్ 3 లో ఉన్న హోటల్ కి వెళ్లారు. అక్కడ బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమవడంతో కస్టమర్లు కంగారుపడ్డారు. వెంటనే అక్కడ ఉన్న హోటల్స్ సిబ్బందికి బొద్దింకను చూపించి ప్రశ్నించారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇస్తూ ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్లు వ్యవహరించారు. దీంతో కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కాల్స్ చేశారు. హోటల్‌ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వారు తిన్న ఫుడ్‌కు మొత్తం ఎనిమిది వేల బిల్లును సైతం చెల్లించాలని హోటల్స్ సిబ్బంది డిమాండ్ చేశారు.

దీంతో చేసేది లేక బిర్యాని తినకపోయినా సరే మిగతావి వాటికి బిల్లు కట్టాల్సి వచ్చింది. మొదట బిల్లు కట్టమని కస్టమర్లు హోటల్ నిర్వాహకులతో గొడవ పడినప్పటికీ హోటల్ నిర్వాహకులు స్థానిక పోలీసులకు ఫోన్ చేశారు. ఇక్కడ న్యూసెన్స్ చేయకుండా బిల్లు కట్టి వెళ్లిపోవాలని పోలీసులు కస్టమర్లను బెదిరించినట్లు తెలుస్తోంది. పోలీసుల రంగు ప్రవేశంతో కస్టమర్లు బిల్లు కట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు.

అయితే ఇటీవల హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అయినా కొన్ని హోటళ్లలో అపరిశుభ్రతే దర్శనమిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు లోతుగా తనిఖీలు చేపట్టే చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యంగానే ఉంటున్నారని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక.. ఎక్కడో తెలుసా?
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక.. ఎక్కడో తెలుసా?
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930ను వాడేస్తున్న సైబర్ కేటుగాళ్లు..
సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930ను వాడేస్తున్న సైబర్ కేటుగాళ్లు..
తన కేసుపై 10 పాయింట్లతో ఆర్జీవీ ట్వీట్
తన కేసుపై 10 పాయింట్లతో ఆర్జీవీ ట్వీట్
అందమైన అమ్మాయిలు డ్యాన్స్‌ చేస్తుండగా.. ఓ ఏనుగు ఏం చేసిందంటే
అందమైన అమ్మాయిలు డ్యాన్స్‌ చేస్తుండగా.. ఓ ఏనుగు ఏం చేసిందంటే
వేరే దేశాల్లో సెటిల్ అవుతున్న టీమిండియా ప్లేయర్లు .. కారణం అదేనా?
వేరే దేశాల్లో సెటిల్ అవుతున్న టీమిండియా ప్లేయర్లు .. కారణం అదేనా?
వచ్చే ఏడాది శని మార్పు.. ఆ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
వచ్చే ఏడాది శని మార్పు.. ఆ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి
శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో బయటపడ్డ నాగశాసనం.. విజయనగర రాజుల ఘనత
శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో బయటపడ్డ నాగశాసనం.. విజయనగర రాజుల ఘనత
గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్..
గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్..
ఆహాలోకి రెండు బ్లాక్ బాస్టర్ మూవీస్..
ఆహాలోకి రెండు బ్లాక్ బాస్టర్ మూవీస్..