Hyderabad: హైదరాబాద్లో ఉంటున్నారా.? అయితే బయట తిరిగేటప్పుడు అది ధరించకుంటే ప్రాణాలు గాల్లో కలిసినట్టే..!

హైదరాబాద్ మహా నగరంలో వాయు కాలుష్యం డిల్లీని మించిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టేషన్లలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లు ప్రమాద సూచికలు మోగిస్తున్నాయి.

Hyderabad: హైదరాబాద్లో ఉంటున్నారా.? అయితే బయట తిరిగేటప్పుడు అది ధరించకుంటే ప్రాణాలు గాల్లో కలిసినట్టే..!
Air Pollution In Hyderabad
Follow us
Sridhar Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 28, 2024 | 8:10 PM

జీహెచ్ఎంసీ, రవాణా, వ్యవసాయ, విద్య తదితర విభాగాలు పీసీబీ సూచనలను పెడచెవిన పెట్టడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు. పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై చెస్ట్ హాస్పిటల్ డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా?  స్వచ్ఛమైన వాతావరణంలో, గాలిలో సూక్ష్మ దూళి కణాల స్థాయి క్యూబిక్ మీటర్‌కు 50 మైక్రోగ్రాముల లోపు ఉండాల్సి ఉండగా సనత్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలో 255 నుంచి 300 మైక్రోగ్రాములుగా నమోదవుతుంది. దీంతో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు బొల్లారం పారిశ్రామిక వాడలో 118, హెచ్‌సీయూ ప్రాంతంలో 128, పటాన్ చెరువులో 151, పాశమైలారంలో 126, సోమాజిగూడలో 121, జూపార్కు వద్ద 102 మైక్రో గ్రాములు ఉంటున్నట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి.కాలుష్యాన్ని నివారించేందుకు నగరం లోపల, వెలుపల ఉన్న పరిశ్రమలతో వాయు కాలుష్యానికి సంబంధించిన పర్యావరణానికి అనుకూలమైన టెక్నాలజీని ఉపయోగించాలి. సోలార్, విండ్ పవర్ వంటి పునరుత్పత్తి వనరులను ప్రోత్సహించాలి.

దీని ద్వారా ప్రతి సంవత్సరం వాయు కాలుష్యాన్ని నివారించేందుకు వీలవుతుందని వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు చెబుతున్నారు. కాలం చెల్లిన పాత వాహనాలకు రహదారపై తిరగకుండా చూడడం, కొత్త వాహనాలకు ఎమిషన్ ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం అవసరమని పీసీబీ సృష్టం చేసింది. నగరంలో మొక్కలు నాటడం, పచ్చని ప్రదేశాలను పెంపొందించడం ద్వారా వాయు నాణ్యత మెరుగుపరవచ్చని తెలిపింది. ప్రజలకు వాయు కాలుష్యం వల్ల జరిగే హాని, దాని ప్రభావాలు, నివారణ మార్గాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ట్రాఫిక్ నిబందనలను కఠినంగా అమలు చేయాలని పీసీబీ హెచ్చరిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని, పాత పరిశ్రమలను ఆధునికీకరించి కాలుష్యాన్ని తగ్గించడానికి మార్పులు చేయాలని సూచించింది.

సనత్ నగర్ ఏరియాలలో ఈ నెల 22, 23, 24, 25 తేదీల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఆ తేదీల్లో 254, 253, 274, 298 గా నమోదైంది. మరో వైపు సిటీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. కొన్ని ఏరియాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మోడరేట్‌గా నమోదవుతున్నది.  వాస్తవానికి గాలివాటాన్ని బట్టి గాలి నాణ్యత పెరగడం, తగ్గడం ఉంటుంది. ఒకచోట నమోదయ్యే వాల్యూస్ ఆ ప్రాంత చుట్టుపక్కల నాణ్యతను కూడా సూచిస్తాయి. ఈ లెక్కన నగరంలో చలికాలం గాలి నాణ్యత సరిగ్గా ఉండడం లేదని చెప్పవచ్చు.

వాయు కాలుష్యం వల్ల వచ్చే సమస్యల గురించి చెస్ట్ హాస్పిటల్ ఇన్చార్జి సూపర్డెంట్ ప్రమోద్ కుమార్ టీవీ9 కు వివరించారు. ” పొల్యూషన్ వల్ల ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి. ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే ఫ్రాంక్ ఐటీసీ లెన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొల్యూషన్లో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి ఉంటాయి. పార్టీ ప్లేట్ మేటర్స్ పీలుస్తున్నప్పుడు అప్పర్ రెసిపీలో ఫిల్టర్ అవుతుంటాయి. వింటర్ సీజన్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దాంతో కార్బన్ డయాక్సైడ్ ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గాని, రెగ్యులర్‌గా డ్రైవింగ్ చేసేవారు కానీ, రోడ్డుపై వీధి వ్యాపారాలు చేసేవారు కానీ పొల్యూషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. వారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండటం మంచిదని” డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు.

ఎక్కువగా పొల్యూషన్ బారిన పడే వారికి ఎలర్జిక్ రైనాయిటీస్ అనే ఒక జబ్బు ఎక్కువగా వస్తూ ఉంటుంది. తుమ్ములు రావడం, ముక్కు కారడం, ముక్కలు బ్లాక్ కావడం లాంటి సింటమ్స్ ఉంటాయి. ఒకసారి ఎక్కువ రోజులు ఉండటం వల్ల వేరే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లంగ్స్‌లో బ్లాక్ ఐటీస్ అనేది కూడా వస్తుంది. ఆ తర్వాత ఊపిరితిత్తులలో నిమోనియాగాని, సీఓపీడీ గాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. తేమ ఎక్కువగా ఉండటం వల్ల చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్‌లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చలికాలం బ్యాక్టీరియా ఎక్కువగా గాల్లో తేలాడుతూ ఉంటుంది ఆ సమయంలో ఆ గాలి పీల్చడం వల్ల ఇన్ఫెక్షన్లు ఆల్రెడీ జబ్బు ఉన్న వాళ్లపై ఎక్కువ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. చిన్నపిల్లలలో ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు ఎలర్జీ ప్రాబ్లమ్‌లు కూడా ఎక్కువగా ఈ మధ్య వస్తున్నాయి. పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటంలో ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి వస్తుంది. స్మోకింగ్ చేస్తూ ఇటువంటి పొల్యూషన్ ఎక్కువైనప్పుడు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. పొల్యూషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా కంటిన్యూగా ఎక్స్పోజింగ్ అయ్యే వాళ్ళు మాస్క్ ఖచ్చితంగా ధరించాలని డాక్టర్ ప్రమోద్ కుమార్ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి