Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: వయనాడ్ అందాలు చూడాల్సిందే.. హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ

చల్లటి వాతావరణంలో కేరళ సందర్శిస్తే ఆ కిక్కే వేరని చెప్పాల్సిన పనిలేదు. మరి ఇలాంటి వాతరణంలో కేరళలోని వయనాడ్‌కు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఆపరేట్‌ చేస్తున్న ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IRCTC: వయనాడ్ అందాలు చూడాల్సిందే.. హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ
Irctc Wayanad
Narender Vaitla
|

Updated on: Nov 28, 2024 | 6:38 PM

Share

చల్లటి వాతావరణం హైదరాబాద్‌లోనే ఉదయం మంచు కురుస్తోంది. అలాంటిది కేరళలాంటి ప్రదేశాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే ఎంతో అందంగా ఉంది కదూ! ఇలాంటి ప్రకృతి రమణీయతను వీక్షించడానికి ఇదే సరైన సమయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా.? అయితే మీకోసమే ఐఆర్‌సీటీసీ ఓ అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేరళలోని వయనాడ్‌ అందాలను వీక్షించేలా ఈ టూర్‌ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.

హైదరాబాద్‌ నుంచి ఆపరేట్‌ చేస్తున్న ఈ టూర్‌ ప్యాకేజీ డిసెంబర్‌ 3వ తేదీన అందుబాటులో ఉంది. వండర్స్‌ ఆఫ్‌ వయనాడ్ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 6 రోజుల పాటు సాగనున్న ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టూర్‌ ఇలా సాగుతుంది..

* మొదటి రోజు ఉదయం 6 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కాచిగూడ-మంగళూరు సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12789) రైలు ఎక్కడం ద్వారా జర్నీ ప్రారంభమవుతుంది. రాత్రంతా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

* రెండో రోజు ఉదయం 6.17 గంటలకు కన్నూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్‌ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. అనంతరం ఫ్రెషప్‌ అయిన తర్వాత సెయింట్ ఏంజెలో ఫోర్ట్​, అరక్కల్ మ్యూజియం సందర్శనం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి వయనాడ్‌కు చేరుకుంటారు. రాత్రి హోటల్‌లో బస ఉంటుంది.

* మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తర్వాత.. కుర్వాదీప్‌లోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం తిరునెల్లి ఆలయం, బాణాసూర సాగర్ డామ్​ సందర్శన ఉంటుంది. రాత్రి కాల్పెట్టలో బస చేస్తారు.

* ఇక 4వ రోజు బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత అంబల్వాయల్‌ హెరిటేజ్‌ మ్యూజియం, స్కూయిపారా ఫాల్స్, ఎడక్కల్ గుహాలు, పొక్కొడే సరస్సు సందర్శన ఉంటుంది. రాత్రి కాల్పెట్టలోనే బస చేస్తారు.

* 5వ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసి హోటల్‌ నుంచి చెకవుట్ అవుతారు. అక్కడి నుంచి కొజికోడ్కు చేరుకుంటారు. అక్కడ కప్పడ్ బీచ సందర్శన ఉంటుంది. సాయంత్రం ఎస్‌ఎమ్‌ స్ట్రీట్‌లో షాపింగ్‌ చేసుకోవచ్చు. రాత్రికల్లా కాలికల్‌ రైల్వేస్టేషన్‌లో డ్రాప్‌ చేస్తారు. రాత్రి 11.35 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మంగళూరు-కాచిగూడ (ట్రెన్‌ నెం 12790) ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌ తిరుగు పయనమవుతారు.

* రాత్రంతా ప్రయాణం ఉంటుంది. 6వ రోజు రాత్రి 11.40 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ధర ఎలా ఉంటుందంటే..

సింగిల్‌ షేరింగ్‌కు 3ఏసీ కంఫర్ట్‌ క్లాస్‌ ధరలు రూ. 36,590, డబుల్‌ షేరింగ్‌కు రూ. 20,700, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ. 16,280గా నిర్ణయించారు. అదే స్టాండర్డ్‌ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు ర. 13,490గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వేరుగా ధరలను నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..