మరో యాదాద్రిగా కాళేశ్వరం: కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ దంపతులు కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మరో యాదాద్రిగా కాళేశ్వరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయిస్తామన్నారు. ఆలయ అభివృద్ధి కోసం 100 నుంచి 400 […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ దంపతులు కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. మరో యాదాద్రిగా కాళేశ్వరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయిస్తామన్నారు. ఆలయ అభివృద్ధి కోసం 100 నుంచి 400 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాలంటూ కేసీఆర్ కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా కాసేపట్లో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ పనులను ఆయన స్వయంగా సందర్శించనున్నారు. 11.30గంటలకు మెడిగడ్డ బ్యారేజ్ పనులపై కేసీఆర్ సమీక్ష జరుపుతారు.