Hyderabad: చిన్నారి ప్రాణం తీసిన తాగుబోతులు.. మద్యం తాగి రాంగ్ రూట్‌లో కారు నడుపుతూ..
హైదరాబాద్ లో తాగుబోతుల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది.. మందుకొట్టి.. ఆ మైకంలో హత్యలు చేసేస్తారా? రోడ్డుమీద అడ్డగోలుగా డ్రైవింగ్ చేస్తారా? మందుకొట్టే ముందు.. ఆపై డ్రైవింగ్ చేసే ముందు ఏం జరుగుతుందన్న స్పృహ ఉండదా? యాక్సిడెంట్‌లలో పిల్లలు చనిపోయినా, ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కనికరం కాని, భయం కానీ లేదా? తాజాగా.. హైదరాబాద్‌లో ఓ తాగుబోతు బాలుడిని హత్యచేశాడు..
మాకు నో రూల్స్.. ఏం జరిగినా డోంట్ కేర్.. తప్పతాగి ఏదైనా చేస్తాం.. ఎవరికైనా ఏదైనా జరిగితే.. అప్పుడు చూసుకుందాం.. తప్పతాగి కొందరు వాహనదారులు చేస్తున్న అరాచకం ఇది.. ఒకరు చేసే నిర్లక్ష్యం..మరొకరి ప్రాణాలు బలితీసుకుంటోంది. మద్యంమత్తు, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. ఇలా హైదరాబాద్ లో తాగుబోతుల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది.. తాజాగా., హైదరాబాద్‌లోని గోల్కొండలో ఓ తాగుబోతు ఆరాచకం సృష్టించాడు.. రాంగ్ రూట్ లో వచ్చి ఓ బాలుడి ఢీకొట్టగా .. తీవ్ర గాయాలతో ఆ బాలుడు మరణించాడు..
ఈ ఘోరం గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లో చోటుచేసుకుంది.. మద్యం తాగి రాంగ్‌రూట్‌లో కారు నడిపిన శ్రీనాథ్ అనే యువకుడు.. టూవీలర్‌ను ఢీకొట్టాడు.. దీంతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. తీవ్రగాయలైన బాలుడిని హాస్పిటల్‌కు తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు.. బాలుడి తండ్రి కూడా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కారులో ఐదుగురు..
కారులో మొత్తం ఐదుగురు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.. వారంతా మద్యం తాగి ఉన్నారని పేర్కొంటున్నారు. ముగ్గురు పరారు కాగా.. కారులోఉన్న ఇద్జరిని పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు.. కారులో మద్యం బాటిళ్ళు కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గోల్కొండ పోలీసులు తెలిపారు..
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..