బీజేపీ సీనియర్ నేత బాల్ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో ఆయన గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో శనివారం సాయింత్రం తుది శ్వాస విడిచారు. బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని కేర్‌ ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. రేపు మధ్యాహ్నం 2గంటల తర్వాత బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని కార్యకర్తల సందర్శన కోసం నాంపల్లిలోని భాజపా కార్యాలయానికి తరలిస్తారు. సాయంత్రం భాజపా కార్యాలయం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర ఉంటుందని, […]

బీజేపీ సీనియర్ నేత బాల్ రెడ్డి కన్నుమూత
Follow us
Vijay K

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:04 PM

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో ఆయన గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో శనివారం సాయింత్రం తుది శ్వాస విడిచారు. బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని కేర్‌ ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు.

రేపు మధ్యాహ్నం 2గంటల తర్వాత బాల్‌రెడ్డి భౌతికకాయాన్ని కార్యకర్తల సందర్శన కోసం నాంపల్లిలోని భాజపా కార్యాలయానికి తరలిస్తారు. సాయంత్రం భాజపా కార్యాలయం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర ఉంటుందని, 5గంటలకు మహాప్రస్థానంలో బాల్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

హైదరాబాద్‌ పాతబస్తీలోని అలియాబాద్‌లో 1945 మార్చి 7న బాల్‌రెడ్డి జన్మించారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1962లో జనసంఘ్‌లో చేరారు. 1985, 1989, 1994లో వరుసగా మూడుసార్లు కార్వాన్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బాల్‌రెడ్డి కుమారుడు మహిపాల్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.