Hyderabad: జెండా సాక్షిగా టీఆర్ఎస్ – బీజేపీ ఫైటింగ్, చెలరేగిపోయిన బండి సంజయ్ – మైనంపల్లి హనుమంతరావు
సంతోషంతో జరుపుకునే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఓ చిన్న ఫొటో.. టీఆర్ఎస్ - బీజేపీ నేతల మధ్య నిప్పు రాజేసింది. అది కాస్త, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే
Bandi sanjay – Mynampally Hanumanta Rao: ‘ఎమ్మెల్యే ముసుగులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోం.. పద్దతి మార్చుకోవాలి’ అని ఎమ్మెల్యే మైనంపల్లికి.. హైదరాబాద్ మాజీ మేయర్, బీజేపీ సీనియర్ నాయకురాలు బండ కార్తీకారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్‌ను బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, మాజీ మేయర్ కార్తకా రెడ్డి తదితరులు పరామర్శించారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యే ముసుగులో రౌడీయిజం చెలాయిస్తున్నాడని, ఇప్పటికైనా పద్దతి మార్చుకుని ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించాలని మాజీ మేయర్, బీజేపీ సీనియర్ నాయకురాలు బండ కార్తీకారెడ్డి పేర్కొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్‌ను ఆమె ఆదివారం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌తో కలిసి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మైనంపల్లి హన్మంతరావు రౌడీషీటర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాడని, అయినా తనపాత జీవన విధానాన్నే కొనసాగిస్తున్నాడన్నారు. ప్రశ్నించే ప్రతి వ్యక్తిపై దాడులకు పాల్పడటం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు.
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను విమర్శించే ముందు మీ గత జీవితాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారామె. రౌడీషీటర్‌గా, భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే నిన్ను గతంలో నగర బహిష్కరణ చేసిన విషయాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుని ఎదుటి వారిపై ఆరోపణలు చేస్తే బాగుంటుందని కార్తీకారెడ్డి హితవు పాలికారు.
కాగా, సంతోషంతో జరుపుకునే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఓ చిన్న ఫొటో.. టీఆర్ఎస్ – బీజేపీ నేతల మధ్య నిప్పు రాజేసింది. అది కాస్త, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య వ్యక్తిగత దూషణలకు దారి తీసింది. దాడి నేపథ్యంలో బండి సంజయ్, మైనంపల్లి.. ఇద్దరూ తీవ్ర స్థాయిలో చెలరేగిపోయారు. వాళ్లిద్దరి మాటల తూటాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మీరే చూడండి.
Read also: Ramya Murder: రమ్యను హత్య చేసిన శశికృష్ణను అరెస్ట్ చేశాం.. కఠినంగా శిక్షిస్తాం : డీజీపీ గౌతమ్ సవాంగ్