
బాలాపూర్ లడ్డు వేలం పాటకి సర్వం సిద్ధంగా ఉంది..మరికొద్ది సేపట్లో బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం ప్రారంభంకానుంది. ఈసారి బాలాపూర్ లడ్డు ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం ఐదు గంటలకు బాలాపూర్ గణేశుడుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వాహకులు. అనంతరం స్వామివారిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్ళనున్నారు ఉత్సవ సమితి సభ్యులు. తిరిగి గ్రామ బొడ్రాయికి వచ్చిన తర్వాత వేలం పాట మొదలుపెడతారు. ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తున్న బాలాపూర్ లడ్డు వేలం పాట ఈ సారి ఎంతవరకు వెళ్తుందో తెలియదు. గత సంవత్సరం 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.
1994లో ఈ బాలాపూర్ లడ్డూ వేల పాట ప్రారంభమైంది. అప్పుడు 450 రూపాయలతో మొదలయ్యి గతేడాది 30 లక్షల ఒక వెయ్యి పలికిన బాలాపూర్ లడ్డు తెలంగాణలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బాలాపూర్ లడ్డు వేలంపాటకు పోలీసు, యంత్రాంగం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
వీడియో ఇక్కడ చూడండి..
బాలాపూర్ లడ్డు వేలం పాటకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాచకొండ సి పి సుధీర్ బాబు వివరించారు. 550 మంది బాలాపూర్ లో పోలీసుల బందోబస్తు లో ఉన్నారని చెప్పారు. లడ్డు వేలంపాటుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారికేట్స్ తో సహా పోలీస్ ఫోర్స్ ఉంటుందని చెప్పారు. బాలాపూర్ నుంచి శోభాయాత్ర సంబంధించి అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని చెప్పారు. అడుగడుగునా లాండర్ పోలీసులు, ట్రాఫిక్, మఫ్టీలో షీ టీమ్స్ విధుల్లో ఉంటారని స్పష్టం చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శోభాయాత్ర ను పరిశీలిస్తామని చెప్పారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..