హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహర్ విజయం
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. 146 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు ప్యానెల్స్ బరిలో నిలిచాయి. అయితే, వాటిలో అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానెళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. దిలీప్ కుమార్ ప్యానెల్ కూడా బరిలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హెచ్‌సీఏలో మొత్తం 226 మంది సభ్యులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు […]

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. 146 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు ప్యానెల్స్ బరిలో నిలిచాయి. అయితే, వాటిలో అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానెళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. దిలీప్ కుమార్ ప్యానెల్ కూడా బరిలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హెచ్‌సీఏలో మొత్తం 226 మంది సభ్యులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరిగింది. 4 గంటలకు ఫలితాలను వెల్లడించారు.