ఆ విషయంలో బెంగుళూరు కంటే.. మనమే ముందున్నాం: కేటీఆర్
ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు కంటే ముందు ఉన్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఎంఫసిస్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఎంఫసిస్ కంపెనీ మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభపరిణామం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదాపూర్ వెస్ట్రన్ హోటల్‌లో థండర్ సాఫ్ట్ ఐటీ కంపెనీ వార్షికోత్సవంలోనూ మంత్రి కేటీఆర్, ఐటీ […]
ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు కంటే ముందు ఉన్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఎంఫసిస్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఎంఫసిస్ కంపెనీ మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభపరిణామం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదాపూర్ వెస్ట్రన్ హోటల్‌లో థండర్ సాఫ్ట్ ఐటీ కంపెనీ వార్షికోత్సవంలోనూ మంత్రి కేటీఆర్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. మరో 850 మందికి ఉద్యోగాలు ఇస్తామని థండర్ సాఫ్ట్ కంపెనీ చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు. చైనా ఐటీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. కాగా.. లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఇంజినీరింగ్ కాలేజ్‌లకు వెళ్లాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
IT and Industries Minister @KTRTRS addressed the gathering at the inauguration ceremony of @Mphasis centre in Hyderabad. pic.twitter.com/FrjWdsrKQC
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 27, 2019