రోటా వైరస్ కి చెక్.. పిల్లలూ ! బీ కేర్ ఫుల్ !

ఈ వర్షాకాల సీజన్ లో ముఖ్యంగా పిల్లలకు ప్రాణాంతకంగా మారుతున్న రోటా వైరస్ కి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. డయేరియాకు కారణమయ్యే ఈ వైరస్ వల్ల తీవ్రమైన జ్వరం వస్తుందని, వ్యాధి ప్రబలితే ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. 40 శాతం డయేరియా కేసులతో పిల్లల ఆసుపత్రులు, క్లినిక్ లు నిండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆయా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. హెల్త్ కేర్ సెంటర్లలో ఈ […]

రోటా వైరస్ కి చెక్.. పిల్లలూ ! బీ కేర్ ఫుల్ !
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 4:40 PM

ఈ వర్షాకాల సీజన్ లో ముఖ్యంగా పిల్లలకు ప్రాణాంతకంగా మారుతున్న రోటా వైరస్ కి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. డయేరియాకు కారణమయ్యే ఈ వైరస్ వల్ల తీవ్రమైన జ్వరం వస్తుందని, వ్యాధి ప్రబలితే ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. 40 శాతం డయేరియా కేసులతో పిల్లల ఆసుపత్రులు, క్లినిక్ లు నిండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆయా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. హెల్త్ కేర్ సెంటర్లలో ఈ వైరస్ కి చెక్ పెట్టే వాక్సీన్ ని అందుబాటులో ఉంచినట్టు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా ఆరు వారాలు, 10 వారాలు, లేదా 14 వారాల వయసు బాలలకు తప్పనిసరిగా రోటా వైరస్ వాక్సీన్ ఇవ్వాల్సి ఉంటుందని, వారు ఏమాత్రం డయేరియాతో బాధ పడుతున్నట్టు తెలిసినా.. నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చేర్పించాలని వారు సూచిస్తున్నారు. ఓరల్ గా 2.4 మిల్లీ లీటర్ల వాక్సీన్ ని, పోలియో వాక్సీన్ తో కలిపి ఇఛ్చిన పక్షంలో వ్యాధి చాలావరకు తగ్గుతుందని అంటున్నారు. అసలు రోటా వైరస్ అంటే ? నీళ్ల విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపు నొప్పి వంటి లక్షణాలే ఈ వైరస్ కారణంగా సోకుతాయట. ముఖ్యంగా చలికాలం, వర్షాకాలాల్లో ఇది ప్రబలుతుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో బాటు పిల్లల చేతులను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. వారికి ఇచ్ఛే ఆహారం లేదా పాల వంటి పదార్థాలను కూడా సదా వేడి చేసి ఇవ్వాలని, సింక్స్, కిచెన్ కౌంటర్లలో తడిలేకుండా చూడాలని కోరుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సలహాపై పిల్లలకు టీకా మందును వెంటనే ఇఛ్చిన పక్షంలో ఈ వైరస్ సోకదని పేర్కొంటున్నారు.

‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..