Water From Air: నీటి కొరతను తీర్చేందుకు మరో ముందడుగు.. గాల్లో నుంచి తాగే నీటిని తయారుచేసే టెక్నాలజీ.. కాలుష్యంలేని వాటర్ తయారీ
Water From Air: భూ మండలం మీద ఉన్న సమస్త జీవకోటి ప్రాణాధారం నీరు...నీరు లేనిదే జీవం లేదు.. జీవి మనుగడ లేదు.. అయితే రోజు రోజుకీ మనిషి చేస్తోన్న పనులతో నీరు కాలుష్యం అయిపోతుంది...
Water From Air: భూ మండలం మీద ఉన్న సమస్త జీవకోటి ప్రాణాధారం నీరు…నీరు లేనిదే జీవం లేదు.. జీవి మనుగడ లేదు.. అయితే రోజు రోజుకీ మనిషి చేస్తోన్న పనులతో నీరు కాలుష్యం అయిపోతుంది. చాలా ప్రాంతాల్లో నీటి కొరత కూడా ఏర్పడింది. అయితే భవిష్యత్తులో భూగర్భ జలాలు ఉన్నా లేకపోయినా.. తాగునీటికి ఎలాంటి కొరత లేకుండా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గాల్లో నుంచి తాగే నీటిని తయారుచేసే టెక్నాలజీని నీ హైదరాబాద్ లో(Hyderabad) Aria Life Water స్టార్ట్ చేశారు.. భూగర్భ జలాల ను వాడకుండా కేవలం ఆకాశంలో నుంచే తాగే నీటిని(Drinking Water) తయారు చేసి వాటర్ బాటిల్స్ లో అమ్మతున్నారు ఈ కంపెనీ వాళ్లు. ఎలాంటి కాలుష్యాలు లేకుండా ఆకాశం నుంచి వచ్చే నీళ్లని ఐదు సార్లు ఇంటర్ చేసి, కావాల్సిన మినరల్స్ యాడ్ చేసి తర్వాతనే బాటిల్లోకి పట్టి అమ్ముతున్నారు.. భూమిలోని నీరు ఎక్కువగా వాడడం వల్ల, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా భూగర్భ జలాలు కలుషితం అయిపోతాయి.. అలా కాకుండా ఆకాశంలో ఉన్న పెద్ద మొత్తంలో నీటిని పడుతూ..ఎలాంటి పొల్యూషన్ లేకుండా నీళ్లను తయారు చేయడమే ఈ కంపనీ ముఖ్యం విధానం. భూమ్మీద ఉన్న అన్ని నదుల కంటే గాలిలో దాదాపు ఆరు రెట్లు ఎక్కువ నీరు ఉంది. అలానే ఈ నీరంతా ఏడాది పొడవునా అనేకసార్లు evaporation and condensation వల్ల ఈ నీరు రీసైకిల్ అవుతూ ఉంటుంది.
RO వాటర్ వాడడం వల్ల భూమి నుండి పంప్ చేయబడిన నీటిలో 70 శాతం వరకు తిరస్కరించడం, దీనివల్ల భవిష్యత్తులో భూగర్భ జలాలు ఎండిపోయే పరిస్థితిలో కాలుష్యంకావొచ్చు. అలా కాకుండా వాతావరణంలో ఉన్న 37.5 మిలియన్-బిలియన్ గ్యాలన్ల నీరుని వాడటం వల్ల కాస్త గ్రౌండ్ వాటర్ పొల్యూషన్‌ని తగ్గించవచ్చు. ఈ 37.5 మిలియన్-బిలియన్ గ్యాలన్ల నీరు మంచినీటికి అత్యంత సమృద్ధిగా ఉండే వనరుగా మారింది. ప్రస్తుత ప్రపంచ నీటి అవసరాలను తీర్చడానికి ఈ వాతావరణ నీటిలో 1% మాత్రమే సరిపోతుంది.
ఈ గాలిలో నుంచి ఉత్పత్తి చేయబడిన ప్రతి వాటర్ బాటిల్ భూమిలో కనీసం మూడు బాటిళ్ల నీటిని ఆదా చేస్తుంది. దాంతో ఏరియా లైఫ్ వాటర్ మార్కెట్‌లో అత్యంత స్థిరమైన నీరుగా మారుతుంది. ఒక ఏరియా లైఫ్ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 90 రూపాయలు.(750ml). ప్రభుత్వ రూల్స్ ప్రకారం కావాల్సిన మినరల్స్, విటమిన్స్ ఈ గాలిలో నుంచి వచ్చిన వాటర్‌కి యాడ్ చేయడం వల్ల ఈ నీళ్లు తాగే వాళ్లు చాలు ఆరోగ్యంగా ఉంటారు.
Also Read: Solar Eclipse 2022: ఈనెల 30న ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం…అశుభంగా పరిగణిస్తోన్న వేద పండితులు..