AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ap 10th Exams: నిన్న తెలుగు.. నేడు హిందీ.. పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌ల కలకలం.. వాట్సాప్‌ గ్రూప్‌లలో ప్రశ్నాపత్రాలు..

Ap 10th Exams: ఆంధప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌లు దుమారం రేపుతున్నాయి. వాట్సప్‌ గ్రూప్‌లలో ప్రశ్నపత్రాలు హల్‌చల్‌ చేస్తుండడంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Ap 10th Exams: నిన్న తెలుగు.. నేడు హిందీ.. పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌ల కలకలం.. వాట్సాప్‌ గ్రూప్‌లలో ప్రశ్నాపత్రాలు..
Paper Leak
Basha Shek
|

Updated on: Apr 28, 2022 | 12:28 PM

Share

Ap 10th Exams: ఆంధప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌లు దుమారం రేపుతున్నాయి. వాట్సప్‌ గ్రూప్‌లలో ప్రశ్నపత్రాలు హల్‌చల్‌ చేస్తుండడంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిన్న (ఏప్రిల్‌27) చిత్తూరు జిల్లాలో తెలుగు పేపర్‌ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రత్యక్షమైంది. అయితే సాయంత్రానికే ఈ పేపర్ లీక్‌లు అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈరోజు జరుగుతున్న హిందీ పేపర్‌ పరీక్ష ప్రశ్నపత్నం కూడా వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షలంత్రి పరీక్షా సెంటర్ల లో పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పరీక్ష పేపర్‌ వాట్సప్‌ గ్రూపులలో చక్కర్లు కొట్టింది.

అధికారుల అయోమయం..

ఇక చిత్తూరు జిల్లాలోనే ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వెదురుకుప్పం మండలంలోని తిరుమలయ్య పల్లి హైస్కూల్ సెంటర్ నుంచి కూడా హిందీ పేపర్ బయటకు వచ్చింది. ఇక్కడ పరీక్ష ప్రారంభమైన అరగంట లోపే పరీక్ష పేపర్‌ బయటకు రావడం గమనార్హం. కాగా పేపర్ లీక్ అయ్యిందా లేక మాల్ ప్రాక్టీస్ అన్నదానిపై పోలీసుల విచారణ సాగిస్తున్నారు. కాగా నిన్న తెలుగు పేపర్‌, నేడు హిందీ పేపర్‌ లీకేజీ వార్తలతో చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల్లో అయోమయం నెలకొంది. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కాగా కరోనా ప్రభావంతో రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లతో జరుగుతున్నాయి. ఈ ఏడాది మొత్తం 6,22,537మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 3,776 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read:

Munnuru Ravi: టీఆర్ఎస్ ప్లీనరీలో శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసు నిందితుడు హల్‌చల్.. ఫోటో వైరల్..

Megastar chiranjeevi : ధర్మస్థలి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చిరంజీవి.. ఆచార్య భారీ సెట్‏లో మెగాస్టార్..

Perfumes: ఈ 5 పెర్ఫ్యూమ్‌లు మహిళలకు గుడ్‌.. వేసవిలో తాజాగా ఉంచుతాయి..!