AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Counselling: పరీక్షా సమయంలో విద్యార్థులు రిలాక్స్‌గా ఉండాలి.. అవసరమైతే సైకలాజికల్ కౌన్సెలింగ్..!

CBSE Counselling: పరీక్షలకి ముందు, పరీక్షల సమయంలో, ఫలితాలు వెలువడినప్పుడు విద్యార్థులు భయాందోళనలకు లేదా మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇలా జరగకూడదనే

CBSE Counselling: పరీక్షా సమయంలో విద్యార్థులు రిలాక్స్‌గా ఉండాలి.. అవసరమైతే సైకలాజికల్ కౌన్సెలింగ్..!
Cbse
uppula Raju
|

Updated on: Apr 28, 2022 | 11:29 AM

Share

CBSE Counselling: పరీక్షలకి ముందు, పరీక్షల సమయంలో, ఫలితాలు వెలువడినప్పుడు విద్యార్థులు భయాందోళనలకు లేదా మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇలా జరగకూడదనే విద్యార్థులకి దేశవ్యాప్తంగా అనేక ఉచిత కౌన్సెలింగ్ అందిస్తున్నారు. CBSE గత 25 సంవత్సరాలుగా మానసిక ఉచిత కౌన్సెలింగ్ అందిస్తోంది. ప్రస్తుతం పరీక్షల సమయంలో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడానికి టెలి-కౌన్సెలింగ్ సౌకర్యాలను ప్రారంభించింది. టోల్ ఫ్రీ నంబర్ 1800118004లో 24*77 ద్వారా ఉచిత IVRS సౌకర్యం కల్పించింది. బోర్డు ప్రకారం.. విద్యార్థులు దేశంలో ఎక్కడి నుంచైనా ఈ నంబర్‌కు కాల్ చేసి సాధారణ సమాచారాన్ని పొందవచ్చు. CBSE బోర్డు 1998 సంవత్సరం నుంచి పరీక్షకు ముందు, ఫలితాల తర్వాత ఉచిత మానసిక కౌన్సెలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. దీని ప్రధాన లక్ష్యం 10, 12 తరగతుల విద్యార్థులని మానసికంగా ధృడంగా చేయడం. కేవలం సీబీఎస్‌ఈ బోర్డు మాత్రమే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర బోర్డులో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎలా అధిగమించాలి, పిల్లల వ్యక్తిగత అనుభవాలు, దూకుడు, డిప్రెషన్, ఇంటర్నెట్ వ్యసనం, పరీక్షా ఒత్తిడికి పరిష్కారం వంటి అంశాలపై కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఇది కాకుండా వివిధ అంశాలపై పాడ్‌క్యాస్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. కోవిడ్-19 సమయంలో ప్రత్యేక టెలి-హెల్ప్‌లైన్ సౌకర్యాన్ని బోర్డు ప్రారంభించింది. ఇది మే 24, 2021 నుంచి నిరంతరంగా నిర్వహిస్తున్నారు. టెలి-కౌన్సెలింగ్ అనేది సోమవారం నుంచి శనివారం వరకు 09:30 AM నుంచి 05:30 PM వరకు బోర్డు అందించే స్వచ్ఛంద ఉచిత సేవ.

మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Perfumes: ఈ 5 పెర్ఫ్యూమ్‌లు మహిళలకు గుడ్‌.. వేసవిలో తాజాగా ఉంచుతాయి..!