AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goat Farming: మేకల పెంపకం కోసం 5 మొబైల్ యాప్‌లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Goat Farming: గత కొన్ని దశాబ్దాలుగా మేకల పెంపకం రైతులకు ప్రయోజనకరంగా ఉంది. మేక పాలతో పాటు మాంసం విక్రయిస్తూ రైతులు ఆదాయాన్ని పొందుతున్నారు.

Goat Farming: మేకల పెంపకం కోసం 5 మొబైల్ యాప్‌లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!
Goat Farming
uppula Raju
|

Updated on: Apr 28, 2022 | 8:44 AM

Share

Goat Farming: గత కొన్ని దశాబ్దాలుగా మేకల పెంపకం రైతులకు ప్రయోజనకరంగా ఉంది. మేక పాలతో పాటు మాంసం విక్రయిస్తూ రైతులు ఆదాయాన్ని పొందుతున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మేకల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే శాస్త్రీయ పద్ధతిలో మేకల పెంపకం చేయడం వల్ల రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ వ్యవసాయం, ఇతర బిజీ కారణంగా శిక్షణ తీసుకోవడానికి రైతులకి సమయం లేదు. దీంతో మేకల పెంపకం కోసం 5 మొబైల్ యాప్‌లు ప్రారంభించారు. ఈ మొబైల్ యాప్‌లన్నింటినీ ICAR సెంట్రల్ గోట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. వీటిని Google Play Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ యాప్‌లు ఎలా ఉంటాయి. వాటి నుంచి ఎలా ప్రయోజనం పొందాలో తెలుసుకుందాం.

బక్రిమిత్ర మొబైల్ యాప్

ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) సెంట్రల్ గోట్‌ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ లైవ్ స్టాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నైరోబి కెన్యా బక్రిమిత్ర ( ICAR-CIRG ) మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేశాయి. ఈ మొబైల్ యాప్ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్ర మేకల రైతుల ప్రకారం రూపొందించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా మేకల పెంపకంలో ప్రధాన అంశాలైన బ్రీడ్ న్యూట్రిషన్, హెల్త్, బ్రీడింగ్, మార్కెటింగ్, హౌసింగ్, జనరల్ మేనేజ్‌మెంట్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ మొబైల్ యాప్‌లో ఇన్‌స్టిట్యూట్ ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. దీని ద్వారా మేకల పెంపకం రైతులు నేరుగా ఇన్‌స్టిట్యూట్‌తో కనెక్ట్ కావచ్చు.

గోట్ బ్రీడ్ మొబైల్ యాప్

గోట్ బ్రీడ్స్ మొబైల్ యాప్‌ను ICAR సెంట్రల్ గోట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. ఈ మొబైల్ అప్లికేషన్ హిందీ, ఆంగ్ల భాషలో ఉంటుంది. ఈ మొబైల్ యాప్ భారతీయ మేక జాతుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. మేకల పెంపకం చేసే రైతులకి ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించడం మొబైల్ యాప్ ప్రధాన లక్ష్యం.

గోట్ ఫార్మింగ్

గోట్ ఫార్మింగ్ మొబైల్ యాప్‌ను సెంట్రల్ గోట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది.ఈ మొబైల్ యాప్ హిందీ, తమిళం, కన్నడ, ఆంగ్ల భాషల్లో సమాచారాన్ని అందిస్తుంది. ఈ మొబైల్ యాప్‌లో భారతీయ మేక జాతులు, వాటి పెంపకం నిర్వహణ, మేకల ఆహారం, షెల్టర్ మేనేజ్‌మెంట్, సాధారణ సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మేక మాంసం, పాల ఉత్పత్తుల గురించిన సమాచారం అందిస్తుంది. మొత్తంమీద ఈ అప్లికేషన్ మేకల పెంపకంలో పాల్గొన్న రైతులకు ప్రాథమిక సమాచారాన్ని అందిస్తుంది.

గోట్ ప్రొడక్ట్స్

గోట్ ప్రొడక్ట్స్ అనే ఈ మొబైల్ యాప్‌ను సెంట్రల్ గోట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. ఈ మొబైల్ యాప్ హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సమాచారాన్ని అందిస్తుంది. ఈ మొబైల్ యాప్ మేక సంబంధిత ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో మేక మాంసం, పాల ఉత్పత్తులు, పోషక సమాచారం అందిస్తుంది.

బక్రి గార్ధన్ సేతు

సెంట్రల్ గోట్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 5వ మొబైల్ యాప్ పేరు బక్రి గార్ధన్ సేతు. ఈ మొబైల్ యాప్ మేకల కృత్రిమ గర్భధారణ గురించి సమాచారాన్ని అందిస్తుంది. ప్రాథమికంగా ఈ మొబైల్ యాప్ మేకల కృత్రిమ గర్భధారణ పద్ధతుల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. దీంతో మేకల పెంపకందారులు జన్యుపరమైన మెరుగుదలతో పాటు జాతి పరిరక్షణకు కృషి చేయవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Health Insurance: 5 లక్షల ఆరోగ్య బీమా.. కేవలం 300 రూపాయలలో వచ్చే అవకాశం..!

Aadhaar Alert: అక్కడి నుంచి ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేస్తున్నారా జాగ్రత్త..!

PM Kisan: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకి హెచ్చరిక.. ఆ పనిచేస్తే వెంటనే అధికారులని కలవండి..!