HURL Recruitment 2022: ఏడాదికి 27 లక్షల జీతం..హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌లో 179 కొలువులకు నోటిఫికేషన్!

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (HURL).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

HURL Recruitment 2022: ఏడాదికి 27 లక్షల జీతం..హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌లో 179 కొలువులకు నోటిఫికేషన్!
Hurl
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 27, 2022 | 6:23 PM

HURL Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (HURL).. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 179

పోస్టుల వివరాలు: చీఫ్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, ఇంజనీర్, కంపెనీ సెక్రటరీ తదితర పోస్టులు

విభాగాలు: మార్కెటింగ్‌, సేఫ్టీ, ఫైర్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్, మెకానికల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: ఏడాదికి రూ.8.5 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, బీఈ/బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NTPC Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. లక్షల్లో జీతం..