UPSC AE Recruitment 2022: మరికొన్ని గంటల్లోనే ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇంజనీరింగ్ చదివినవారు అర్హులు!

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (Assistant Engineer Posts), జూనియర్ టెక్నికల్‌ ఆఫీసర్‌,  లెక్చరర్‌ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్న సందర్భంగా..

UPSC AE Recruitment 2022: మరికొన్ని గంటల్లోనే ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇంజనీరింగ్ చదివినవారు అర్హులు!
Upsc Ese Prelims 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 28, 2022 | 3:02 PM

UPSC Assistant Engineer Recruitment 2022: యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (Assistant Engineer Posts), జూనియర్ టెక్నికల్‌ ఆఫీసర్‌,  లెక్చరర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్న సందర్భంగా.. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా కమిషన్‌ సూచించింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 5
  • జూనియర్ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు: 2
  • లెక్చరర్‌ (చైనీస్‌) పోస్టులు: 1
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఫిషింగ్‌ హర్బర్) పోస్టులు: 1
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు: 1
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఇంజనీరింగ్‌) పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు:

  • అసిస్టెంట్ ఇంజనీర్ (NQA) పోస్టులకు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా మెరైన్ లేదా నేవల్ ఆర్కిటెక్చర్ లేదా ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
  • లెక్చరర్ (చైనీస్) పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి చైనీస్ భాషలో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
  • అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిషింగ్ హార్బర్) పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
  • అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ టెక్నాలజీలో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్ధులకు: రూ.25 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

HURL Recruitment 2022: ఏడాదికి 27 లక్షల జీతం..హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌లో 179 కొలువులకు నోటిఫికేషన్!

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?