Hemant Soren: హైదరాబాద్ చేరుకున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్.. మరికాసేపట్లో సీఎం కేసీఆర్‌తో చర్చలు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ రెండు రోజుల పర్యలన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమవుతారు.
Hemant Soren meets CM KCR: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ రెండు రోజుల పర్యలన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమవుతారు. ఈ సంధర్బంగా జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం వివిధ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలతో సమావేశమై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ రావు రాజధాని హైదరాబాద్‌లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా రాబోయే రాష్ట్రపతి ఎన్నికలతో పాటు అనేక ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రానున్న కాలంలో రాష్ట్రపతి ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ చాలా కాలంగా భారత దేశవ్యాప్తంగా పర్యటించి బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ మార్చి ప్రారంభంలో జార్ఖండ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను కలుసుకుని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రాష్టప్రతి ఎన్నికలోపు అన్ని పార్టీలను కార్నర్ చేయడమే కాకుండా రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.