AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మతిస్థిమితం లేని బాలికపై పెదనాన్న, ఏఆర్ హెడ్​కానిస్టేబుల్ అత్యాచారం..

మతిస్థిమితం లేని బాలికపై కొన్ని నెలలుగా ఆమె పెదనాన్న, ఏఆర్​ హెడ్ కానిస్టేబుల్​ లైంగిక దాడి చేశారు. నిజామాబాద్​ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

Telangana: మతిస్థిమితం లేని బాలికపై పెదనాన్న, ఏఆర్ హెడ్​కానిస్టేబుల్ అత్యాచారం..
Minor girl raped
Ram Naramaneni
|

Updated on: Apr 28, 2022 | 4:10 PM

Share

Nizamabad district: కఠిన చట్టాలు తెస్తున్నా.. కామాంధుల బుద్ది మారడం లేదు. ఆడపిల్ల కనపడితే చెలరేగిపోతున్నారు. చెరబట్టి.. జీవితం నాశనం చేస్తున్నారు. వావివరసలు లేవు.. వయసుతో సంబంధం లేదు. బెదిరింపులకు పాల్పడుతూ.. బ్రతుకులు చిదిమేస్తున్నారు. ప్రతి రోజూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మృగాళ్ల బారిన పడి.. అబలల జీవితాలు నాశనం అయిపోతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్​ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు లేని బాలికకు అండగా నిలబడి.. భరోసా నిలబడాల్సిన పెదనాన్న.. మరో వ్యక్తితో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడి..  జీవితాన్ని చిదిమేశాడు. మరో దారుణ విషయం ఏంటంటే.. ఆ బాలికకు మతిస్థిమితం కూడా సరిగా లేదు.

మతిస్థిమితం లేని బాలికపై కొన్ని నెలలుగా ఆమె పెదనాన్న, ఏఆర్​ హెడ్ కానిస్టేబుల్​ లైంగిక దాడి చేస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోతే పెదనాన్న ఇంట్లో ఉంటుంది ఆ బాలిక. మెంటల్ స్టేటస్ సరిగ్గా లేని బాలికను.. కన్న కూతురుతో సమానంగా చూసుకోవాలి. కానీ ఆ కామాంధుడు బిడ్డ వరస అవుతుందని కూడా ఆలోచించలేదు. కామంతో మృగంలా వ్యవహరించి.. బాలికను చెరబట్టాడు. ఈ కామాంధుడికి తోడు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ఏఆర్​ హెడ్​కానిస్టేబుల్​ కూడా ఈ పాపంలో భాగం పంచుకున్నాడు. ప్రస్తుతం బాధితురాలు 8 నెలల గర్భవతి. బుధవారం ఈ విషయం వెలుగుచూసింది. నిజామాబాద్ రూరల్ టౌన్  పోలీసులు… కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. నిందితులు కఠిన చర్యలు తీసుకోవాలి ఐద్వా లీడర్స్ కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read: May flower: ముందే పూచిన మే ఫ్లవర్..! వీటిని మీరు ఎప్పుడైనా చూశారా..?