May flower: ముందే పూచిన మే ఫ్లవర్..! వీటిని మీరు ఎప్పుడైనా చూశారా..?

ఏడాదంతా ఈ పూలు కనిపించవు. సంవత్సరంలో ఒకసారి పూచే ఈ పూల కోసం అందరూ వేచి చూస్తూ ఉంటారు. అల్లూరి జిల్లాలో దాదాపు ప్రతి ఇంట్లో మే పూల మొక్కలు కనిపిస్తుంటాయి.

May flower: ముందే పూచిన మే ఫ్లవర్..! వీటిని మీరు ఎప్పుడైనా చూశారా..?
May Flowers
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 28, 2022 | 2:56 PM

మన్యం గిరుల్లో అరుదైన పువ్వులు గుబాళిస్తున్నాయి ..! చక్కటి వర్ణం, ఆకారంతో ఆకట్టుకుంటున్నాయి. తమవైపు రారమ్మని పిలుస్తున్నాయి. అతిథిగా వచ్చిన ఆ పూలను జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు. అల్లూరి జిల్లా(Alluri Sitharama Raju district) ఏజెన్సీలో మే ఫ్లవర్స్ కనువిందు చేస్తున్నాయి. ప్రతి ఏటా మే నెల(May Month)లో పూచే ఈ పూలను మే ఫ్లవర్స్ అని పిలుస్తారు. గుబురుగా, బంతి ఆకారంలో, ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఏడాదంతా ఈ పూలు కనిపించవు. సంవత్సరంలో ఒకసారి పూచే ఈ పూల కోసం అందరూ వేచి చూస్తూ ఉంటారు. అల్లూరి జిల్లాలో దాదాపు ప్రతి ఇంట్లో మే పూల మొక్కలు కనిపిస్తుంటాయి. మే నెలలో ఈ పూలతో దేవుళ్లను పూజించేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఈసారి వింత ఏంటంటే.. ముందే ఈ పూలు పూస్తున్నాయి. ఏప్రిల్(April) చివరి వారంలో మే పూల మొగ్గలు విచ్చుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముందుగానే ఈ పూలు విరబుస్తూ  అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

బంతి, చామంతి, గులాబి, కనకాంబరం, లిల్లి.. ఇలా ఎన్ని పూలు పెరట్లో పూచినా… మే నెలలో పూచే ఈ అరుదైన పుష్పాల ఉంటే మాత్రం ఆ లుక్కే వేరు. కోవిడ్ తర్వాత ఈ పువ్వులు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఎందుకంటే ఈ పూలను చూసిన చిన్నారులు… సరదాగా కరోనా వైరస్ పువ్వులని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ పూల ఆకారం.. కొవిడ్ వైరస్ ఆకారంలో సరిపోలి ఉంటాయి. మే పూలు స్కాడొక్సస్ మల్టీ ఫ్లోరస్ జాతికి చెందినవి. ఇవి ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఆంధ్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. బ్లడ్ లిల్లీ, బాల్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అని అనే పేర్లతో కూడా ఈ పూలను పిలుస్తుంటారు. భారతదేశంలో ఇక్కడి వాతావరణ పరిస్థితుల బట్టి మే నెలలో ఈ పుష్పం విరబూస్తూ ఉంటుంది. అందుకే దీనికి మే ఫ్లవర్ అని పిలుస్తుంటారు.

ఖాజా, టీవీ9 తెలుగు, వైజాగ్

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.