Charminar Clock: ‘పగిలిన పాత జ్ఞాపకం’.. చార్మినార్ గడియారాల చరిత్ర తెలుసా..?
చార్మినార్‌లో ధ్వంసమైన గడియారానికి రిపేర్లు ప్రారంభించారు ఆర్కియాలజీ విభాగం సిబ్బంది. మరమ్మతు పనుల్లో భాగంగా నిన్న తూర్పు వైపున ఉన్న పురాతన గడియారం ధ్వంసమైంది. గోవ పైప్‌లు తీస్తుండగా 135 ఏళ్ల నాటి గడియారానికి పైపులు తగిలాయి. దీంతో డయల్ బోర్డు దెబ్బతిన్నది.
చార్మినార్‌లో ధ్వంసమైన గడియారానికి రిపేర్లు ప్రారంభించారు ఆర్కియాలజీ విభాగం సిబ్బంది. మరమ్మతు పనుల్లో భాగంగా నిన్న తూర్పు వైపున ఉన్న పురాతన గడియారం ధ్వంసమైంది. గోవ పైప్‌లు తీస్తుండగా 135 ఏళ్ల నాటి గడియారానికి పైపులు తగిలాయి. దీంతో డయల్ బోర్డు దెబ్బతిన్నది. వెంటనే రంగంలోకి దిగిన ఆర్కియాలజీ విభాగం రిపేర్లు చేస్తోంది. పాక్షికంగా ధ్వంసమైనా గడియారం పనిచేస్తూ సరైన సమయాన్ని సూచిస్తోంది. చార్మినార్.. అంతర్జాతీయ ఐకానిక్ చారిత్రక కట్టడం. చార్మినార్‌కే కాదు, దాని మీదున్న గడియారాలకు కూడా ఘన చరిత్ర ఉంది. చారిత్రక కట్టడానికి నాలుగు వైపులా గడియారాలు ఉంటాయి. 1889లో చార్మినార్‌కు నలువైపులా గడియారాలను అమర్చారు. వీటిని నాటి పాలకులు లండన్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. నేటికీ ఆ గడియారాలు సమయాన్ని సక్రమంగా తెలియజేస్తున్నాయి. ప్రతి 24 గంటలకు ఒకసారి గడియారాలకు కీ ఇవ్వడం వల్ల సరైన టైంను తెలియజేస్తున్నాయి. 135 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న పురాతన గడియారం ప్లేస్‌లో కొత్తది అమర్చుతారా? లేక దానికే రిపేర్ చేస్తారా అన్న సందేహం వీడింది. ఉన్న దానికే రిపేర్లు చేపట్టారు. అయితే.. చార్మినార్ నిర్మాణానికి సంబంధించిన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసేలా చర్యలు చేపట్టాలని సందర్శకులు సూచిస్తున్నారు.
వీడియో చూడండి..
అసలేం జరిగిందంటే..
కాగా.. గత కొంత కాలంగా చార్మినార్ దగ్గర మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో ఇనుప పైప్‌లతో గోవ నిర్మించారు. గోవా పైప్‌లు తీస్తుండగా ఒక్కసారిగా ఈస్ట్ వైపు ఉన్న గడియారానికి పైపులు తగలడంతో ధ్వంసమైంది.. డయల్ బోర్డు పూర్తిగా దెబ్బతింది. అయితే.. డయల్ బోర్డు కొత్తది చేయడం కాస్త కష్టంతో కూడుకున్న నేపథ్యంలో మరమ్మతులు చేయడం ప్రారంభించారు. చార్మినార్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గడియారం పగిలిపోవడంతో అధికారులు అప్రమత్తమై.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..