ఈఎస్‌ఐ స్కాం: డాక్టర్‌కు బెదిరింపులు.. ఆడియో టేప్స్ లభ్యం!
ఈఎస్ఐ మెడికల్ స్కాం మరో కీలక మలుపు తిరిగింది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ రికార్డింగ్స్‌లోని వివరాలు ప్రకారం సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాధ్.. తప్పుడు బిల్లులు పెట్టాలని ఈఎస్ఐ డాక్టర్‌ను ఆదేశించాడు. రూ. 50 లక్షలకు తప్పుడు బిల్లులను సృష్టించాలని సదురు డాక్టర్‌పై అతడు ఒత్తిడి తెచ్చాడు. ఏడాది తర్వాత క్యాంపు నిర్వహించినట్లు బిల్లులు తయారుచేయాలని ఆమెకు సూచించాడు. అయితే ఇలాంటి బిల్లులు తయారు చేయలేనని డాక్టర్ తెగేసి […]
ఈఎస్ఐ మెడికల్ స్కాం మరో కీలక మలుపు తిరిగింది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన ఆడియో టేపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ రికార్డింగ్స్‌లోని వివరాలు ప్రకారం సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాధ్.. తప్పుడు బిల్లులు పెట్టాలని ఈఎస్ఐ డాక్టర్‌ను ఆదేశించాడు. రూ. 50 లక్షలకు తప్పుడు బిల్లులను సృష్టించాలని సదురు డాక్టర్‌పై అతడు ఒత్తిడి తెచ్చాడు. ఏడాది తర్వాత క్యాంపు నిర్వహించినట్లు బిల్లులు తయారుచేయాలని ఆమెకు సూచించాడు. అయితే ఇలాంటి బిల్లులు తయారు చేయలేనని డాక్టర్ తెగేసి చెప్పడంతో సురేంద్రనాధ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా మరో మహిళా అధికారిని సైతం ఫోన్ చేసి బెదిరించాడు. డైరెక్టర్ అండ్ జాయింట్ డైరెక్టర్ బిల్లుల కోసం అడుగుతున్నారని సురేంద్రనాథ్ ఈఎస్‌ఐ డాక్టర్‌కు చెప్పినప్పటికీ తాము నిబంధనలు ప్రకారమే ముందుకు వెళ్తామని సదరు డాక్టర్స్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు ఇప్పటికే ఏడుగురు నిందితులు అరెస్టు కాగా.. వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.