క్లినికల్ ట్రయల్ కేస్.. కేంద్రమంత్రి సీరియస్..

నిలోఫర్ ఆస్పత్రిలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ పై పెనుదుమారం రేగుతోంది. ఈ వ్యవహారం పై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నిలోఫర్ సూపరింటెండెంట్‌తో.. త్రిసభ్య కమిటీ భేటీ అయ్యి.. ట్రయల్స్‌కు అవలంభిస్తున్న పద్దతులు, ఎథిక్స్ కమిటీ అనుమతులపై విచారణ జరపనుంది. విచారణలో భాగంగా హెచ్‌ఓడీ రవికుమార్, ఆర్ఎంఓ లల్లు ప్రసాద్ నాయక్‌ల స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేయనుంది. మరోవైపు ఆస్పత్రిలో ఇద్దరు సీనియర్‌ […]

క్లినికల్ ట్రయల్ కేస్.. కేంద్రమంత్రి సీరియస్..
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 9:57 AM

నిలోఫర్ ఆస్పత్రిలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ పై పెనుదుమారం రేగుతోంది. ఈ వ్యవహారం పై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నిలోఫర్ సూపరింటెండెంట్‌తో.. త్రిసభ్య కమిటీ భేటీ అయ్యి.. ట్రయల్స్‌కు అవలంభిస్తున్న పద్దతులు, ఎథిక్స్ కమిటీ అనుమతులపై విచారణ జరపనుంది. విచారణలో భాగంగా హెచ్‌ఓడీ రవికుమార్, ఆర్ఎంఓ లల్లు ప్రసాద్ నాయక్‌ల స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేయనుంది. మరోవైపు ఆస్పత్రిలో ఇద్దరు సీనియర్‌ వైద్యుల మధ్య ఆధిపత్యపోరుతో.. క్లినికల్‌ ట్రయల్స్‌ విషయంపై రచ్చ జరుగుతోందని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ పదవీ విరమణ చేస్తే.. ఆ కుర్చీని ఆక్రమించుకోవడానికి ఆ ఇద్దరు వైద్యులు తమ ప్రయత్నాల్లో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి.