రేపే తెలంగాణ గ్రామీణ ఆవిష్కరణ సంబురాలు..!
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేషన్ తెలంగాణ గ్రామీణ ఆవిష్కరణ సంబురాలను రేపు అనగా జూన్ 2న నిర్వహించనున్నారు. ఈ వేడుకలో వివిధ రంగాల్లో వ్యక్తుల జీవితాలను అత్యంత ప్రభావితం చేసిన 65 గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శన జరగనుంది. మరోవైపు గ్రామీణ ఆవిష్కరణలను, ఆలోచనలను పంచుకుందాం అంటూ నిర్వాహకులు అందరిని ఆహ్వానించారు. ఇక బేగంపేటలోని పీపుల్స్ ప్లాజాలో రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు ఈ ప్రదర్శన జరగనుంది. […]
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేషన్ తెలంగాణ గ్రామీణ ఆవిష్కరణ సంబురాలను రేపు అనగా జూన్ 2న నిర్వహించనున్నారు. ఈ వేడుకలో వివిధ రంగాల్లో వ్యక్తుల జీవితాలను అత్యంత ప్రభావితం చేసిన 65 గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శన జరగనుంది. మరోవైపు గ్రామీణ ఆవిష్కరణలను, ఆలోచనలను పంచుకుందాం అంటూ నిర్వాహకులు అందరిని ఆహ్వానించారు. ఇక బేగంపేటలోని పీపుల్స్ ప్లాజాలో రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు ఈ ప్రదర్శన జరగనుంది.
అటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రేపు తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు అనగా, జూన్ 2 ఆదివారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, పార్టీ నాయకులు హాజరుకానున్నారు.
— TRS Party (@trspartyonline) June 1, 2019
జూన్ 2 వ తేదీన, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న తెలంగాణ గ్రామీణ ఆవిష్కరణల సంబురాల్లో పాల్గొందాం. గ్రామీణ ఆవిష్కరణలకు మన వంతు ప్రోత్సాహం అందిద్దాం. pic.twitter.com/u56n7XRwcf
— TRS Party (@trspartyonline) May 31, 2019