Hyderabad: హైదరాబాద్‌ వాసులకు అలెర్ట్‌.. న్యూ ఇయర్‌ సందర్భంగా నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే

|

Dec 31, 2022 | 7:44 AM

నివారం (డిసెంబర్‌ 31) అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, నిబంధనలు విధించారు. భద్రతా చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లై ఓవ‌ర్లను మూసివేయనున్నారు.

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు అలెర్ట్‌.. న్యూ ఇయర్‌ సందర్భంగా నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలివే
Traffic Restrictions
Follow us on

మరికొన్ని గంటల్లో 2022 ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరం వేడుకలకు ప్రపంచమంతా ముస్తాబవుతోంది. ఇక హైదరాబాద్‌ వాసులు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ శుభ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం (డిసెంబర్‌ 31) అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, నిబంధనలు విధించారు. భద్రతా చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లై ఓవ‌ర్లను మూసివేయనున్నారు. బేగంపేట్, లంగ‌ర్ హౌజ్ ఫ్లై ఓవ‌ర్లు మాత్రం తెరిచి ఉంటాయ‌న్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌ వైపు వాహ‌నాల‌ను అనుమ‌తించ‌మన్నారు. హుస్సేన్ సాగ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. నగరవాసులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు  హెచ్చరించారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు..

వీవీ స్టాచ్యూ, ఎన్టీఆర్ మార్గ్, రాజ్ భ‌వ‌న్ రోడ్, బీఆర్కే భ‌వ‌న్‌, తెలుగు త‌ల్లి జంక్షన్‌, ఇక్బాల్ మినార్, ల‌క్డీకాపూల్‌, లిబ‌ర్టీ జంక్షన్‌, అప్పర్‌ ట్యాంక్ బండ్, అంబేడ్కర్‌ స్టాచ్యూ, ర‌వీంద్ర భార‌తి, ఖైర‌తాబాద్ మార్కెట్, నెక్లెస్ రోట‌రీ, సెన్సేషన్‌ థియేట‌ర్, రాజ్‌దూత్ లేన్, న‌ల్లగుట్ట రైల్వే బ్రిడ్జి, సంజీవ‌య్య పార్క్, పీవీఎన్ఆర్ మార్గ్, మినిస్టర్‌ రోడ్, సైలింగ్ క్లబ్‌, క‌వాడిగూడ ఎక్స్ రోడ్, లోయ‌ర్ ల్యాంక్ బండ్, క‌ట్టమైస‌మ్మ టెంపుల్, అశోక్ న‌గ‌ర్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు. ఇక బ‌స్సులు, ట్రక్కులతో పాటు ఇత‌ర వాహ‌నాల‌ను రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు హైద‌రాబాద్‌లోకి అనుమ‌తించ‌రు. ఇక న‌గ‌ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు జరుగుతాయని, పట్టుబడితే జైలు శిక్షతో పాటు జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. మందబాబుల కోసం అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయని, వాహనాలను ఎట్టిపరిస్థితులలో నడపరాదని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..