హైదరాబాద్, అక్టోబర్ 7: హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజు-2లో గున్ గల్ నుంచి సాహెబ్ నగర్ వరకు ఉన్న 2200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపు లైనుకు రాగన్నగూడ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ కారణంగా 11-10-2023, బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే.. 12.10.2023, గురువారం ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ 24 గంటలు జలమండలి పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది. ఈ విషయాన్ని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరమ్మతు పనులు పూర్తయిన తరువాత.. నీటి సరఫరాను పునరుద్ధరించడం జరుగుతుంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి.. నీటిని ముందుగానే నిల్వ చేసుకుంటే ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి ఒక ప్రకటన విడుదల చేసింది.
పైన పేర్కొన్న నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని హైదరాబాద్ జలమండలి అధికారులు సూచించారు. అలాగే ముందుగానే నీటిని నిల్వ ఉంచుకోవాలని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..