Hyderabad: మాదాపూర్‌లో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్‌ కలకలం.. బస్సు డ్రైవర్‌పై అనుమానం.. పోలీసుల గాలింపు

|

Jan 24, 2023 | 5:45 AM

మాదాపూర్‌లో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్‌ కావడం తీవ్ర కలకలం రేపింది. 5వ తరగతి చదువుతున్న తమ కూతురు కనిపించడం లేదంటూ మాదాపూర్‌ పీఎస్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బస్సు డ్రైవర్‌పై తమకు అనుమానం ఉందంటూ ఫిర్యాదులో పేరెంట్స్‌ పేర్కొన్నారు.

Hyderabad: మాదాపూర్‌లో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్‌ కలకలం.. బస్సు డ్రైవర్‌పై అనుమానం.. పోలీసుల గాలింపు
Girl Missing
Follow us on

మాదాపూర్‌లో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్‌ కావడం తీవ్ర కలకలం రేపింది. 5వ తరగతి చదువుతున్న తమ కూతురు కనిపించడం లేదంటూ మాదాపూర్‌ పీఎస్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బస్సు డ్రైవర్‌పై తమకు అనుమానం ఉందంటూ ఫిర్యాదులో పేరెంట్స్‌ పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్‌పై కోసం గాలింపు చేపట్టారు. కాగా ఇటీవల హైదరాబాద్‌ మహానగరంలో వరుసగా బాలికల కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. దీంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది చివరిలో సికింద్రాబాద్ పరిధిలోని మహంకాళి ప్రాంతంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. మహంకాళి పరిధిలోని ఓ హోటల్ లో పని చేస్తున్న రాము అనే వ్యక్తి ఈ బాలికను అపహరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టి బాలికను రక్షించి పేరెంట్స్‌ వద్దకు చేర్చారు. అలాగే కవాడిగూడకు చెందిన 13 ఏళ్ల బాలిక ఇలాగే అదృశ్యమైంది. మానసిక పరిస్థితి సరిగా లేని తమ కూతురు కనిపించకుండా పోయిందంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

ఇక మూడు రోజుల క్రితం వరంగల్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర నగర్ లోని 4వ తరగతి చదువుతున్న ముతుల్ అనే బాలిక కొబ్బరి నూనె తెచ్చేందుకు కిరాణా షాపు వెళ్లగా, అక్కడ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్చీఫ్‌లో మత్తుమందు పెట్టి బాలికను కిడ్నాప్ చేశారు. అయితే దుండగులు ఒక చోట వ్యాన్ ఆపి టీ తాగుతుండగా, బాలికకు స్పృహ రావడంతో వాళ్ల చెర నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి..